A2 గా పేరున్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తండ్రిని అడ్డం పెట్టుకుని, డబ్బులు కొట్టేసిన కేసుల్లో , మనోడు A2 గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈయనగారు ట్విట్టర్ లో వాడే భాష చూస్తే, రోడ్డు మీద రిక్షా తోక్కుకునే వాళ్ళు ఇంకా సంస్కారంగా మాట్లాడతారు అనిపిస్తుంది. అంట జుబుక్సాకరంగా, ట్విట్టర్ లో కూస్తూ ఉంటాడు. ఎన్ని సార్లు, ఎంత మంది ఆ భాష పై అభ్యంతరం చెప్పినా, ట్విట్టర్ లో ఆ భాష మాత్రం, మారదు. ఇదే విషయం ప్రస్తావిస్తూ, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈ రోజు నిప్పులు చెరిగారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిగ్గు, శరం లేదని, ట్విట్టర్ లో తాను వాడే భాష తప్పని , ఎన్ని సార్లు చెప్పినా, అలాగే మాట్లాడుతున్నారని అన్నారు.

vs 24042019

తెలంగాణలో ఓ వ్యక్తి తనతో మాట్లాడుతూ..‘మా దగ్గర మూడు కేటగిరీలు ఉంటాయండీ. ఎల్1 అంటే లోఫర్, ఎల్2 అంటే లోఫర్-లఫూట్, ఎల్3 అంటే లోఫర్-లఫూట్-లఫంగా అని నేతలకు గ్రేడింగ్ ఇస్తాం’ అని చెప్పాడన్నారు. ప్రస్తుతం చూస్తే విజయసాయిరెడ్డి ఈ మూడో కేటగిరిలోకి వస్తాడని అనిపిస్తోందని దుయ్యబట్టారు. దేశంలో విజయసాయిరెడ్డి వాడుతున్న భాష కంటే ఘోరంగా ఏ నేతలు కూడా వాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కుటుంబరావు మాట్లాడారు. విజయసాయిరెడ్డి ఓ మానసిక రోగంతో బాధపడుతున్నారని కుటుంబరావు విమర్శించారు. దీనినుంచి ఆయన బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

vs 24042019

విజయసాయిరెడ్డి ఆడిటర్ గా ఉన్న జగతి పబ్లికేషన్స్ ఇప్పటివరకూ డివిడెండ్ చెల్లించిందా? అని ప్రశ్నించారు. వరంగల్, రంగారెడ్డి కోర్టుల్లో తనపై కేసులు ఉన్నట్లు చెబుతున్న నేతలు, వాటిపై ఆధారాలు చూాపాలన్నారు. ఏపీలో బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తాయని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తాను కష్టపడి సంపాదించాననీ, అందువల్లే జాగ్రత్తగానే పెట్టుబడి పెడతానని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిలా ఇతర కంపెనీలను ప్రభావితం చేసి డబ్బులు దొబ్బేయలేదని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి తెలంగాణ ఎల్3 బ్యాచ్ అని దుయ్యబట్టారు. జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ షరతులను పాటిస్తున్నారా అని నిలదీశారు. జగన్‌, విజయసాయిరెడ్డిపై ఉన్న కేసులను సాగదీయకుండా చూస్తే.. ఇద్దరి బండారం బయటపడుతుందన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఎక్కువ పేజీలు ఆయన నేరచరిత్రకు సంబంధించినవేనని చెప్పారు. ఆర్థిక శాఖ నిర్ణయాలకు సంబంధించి సమావేశాల్లో ఎప్పుడూ పాల్గొనలేదని, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడి హోదాలో మాత్రమే... కొన్ని సమావేశాలకు హాజరయ్యానని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read