ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో, విజయసాయి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి బంధం కొనసాగుతూనే ఉంది... ఈ రోజు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు... పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయానికి వెళ్లిన విజయసాయిరెడ్డి ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం గంట పాటు నిరీక్షించారు.... విజయసాయిరెడ్డి వెంట జగన్ బంధువు వినీత్‌రెడ్డి కూడా ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. వినీత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది... అయితే, ఇదే సందర్భంలో అక్కడ మీడియాను చూసిన విజయసాయిరెడ్డి, అక్కడ నుంచి జారుకున్నారు...
విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్లారు అనే విషయం తెలియాల్సి ఉంది... అలాగే వినీత్ రెడ్డి ని ఎందుకు తీసుకువెళ్ళారు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది... బీజేపీతో జగన్ పార్టీ కలిసిపోతుంది అనే విషయం ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.. అందులో భాగంగానే, ఈ రోజు విజయసాయి రెడ్డి, వచ్చే ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి అనేదాని పై చర్చింటానికి వెళ్ళరా అనే అనుమానం కలుగుతుంది.. ఎందుకంటే, వినీత్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని చూస్తున్నారు... ఈ సమయంలో, మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా, అతను ముందే బీజేపీ లో చేరుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి...
నిన్నటి నిన్న, పియూష్ గోయల్ తెలుగుదేశం ఎంపీలను పిలిచి మరీ, అప్పాయింట్మెంట్ రద్దు చెయ్యటం... అదే సందర్భంలో, వైసిపీ ఎంపీకి అప్పాయింట్మెంట్ ఇవ్వటం చూస్తే, వీరికి వైసిపీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది.... అలాగే విజయసాయి రెడ్డి కూడా, ప్రధాని మోడీ పై తనకు పూర్తి విశ్వాసం ఉందని, కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే... అదే సందర్భంలో, అవిశ్వాసం అంటూ డ్రామాలు ఆడుతున్న సంగతి చూస్తున్నాం.. ఈ రోజు మళ్ళీ ప్రధాని ఆఫీస్ లో చేరారు... ఇవన్నీ చూస్తున్న ప్రజలు పిచ్చి వాళ్ళా ?