విజయవాడలో అక్రమ మద్యం కేసులో పట్టుకున్న అజయ్ అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోవటం, సంచలనంగా మారింది. సందీప్ అనే వ్యక్తి వద్ద, అజయ్ అనే వ్యక్తి గత కొన్నాళ్ళుగా, డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే ఆర్టీసి బస్ స్టాండ్ లో తనకు ఒక పార్సెల్ వచ్చిందని, దాన్ని తెసుకుని రావాలని అజయ్ ని ఆదేశించారు. అయితే ఈ నేపధ్యంలోనే అజయ్ వెళ్లి ఆ పార్సిల్ తీసుకుని వచ్చారు. ఈ నేపధ్యంలో ఎస్ ఈ బి పోలీసులు అజయ్ ని అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే అజయ్ చనిపోవటంతో ఈ కేసు సంచలనం అయ్యింది. అజయ్ ని హాస్పిటల్ కు తీసుకు రావటంతో, ఆయన చనిపోయాడని డాక్టర్లు దృవీకరించారు. అయితే అజయ్ ని పోలీసులు కొట్టటంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వేధింపుల వల్లే తమ బిడ్డ చనిపోయాడని వాపోయారు. అయితే పోలీసులు మాత్రం, విచారణ చేస్తున్న సమయంలో, అజయ్ కు చెమటలు పట్టి, ఫిట్స్ లాగా వచ్చాయని, హాస్పిటల్ కి కూడా తీసుకుని వెళ్ళమని, కానీ అప్పటికే ఆయన చనిపోయారని చెప్తున్నారు.
అయితే ఈ కేసుకు సబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావలసి ఉంది. వాస్తవాలు మొత్తం కప్పి పుచ్చుతున్నారని, అజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అజయ్ ను అదుపులోకి తీసుకోవాల్సిన బలమైన కారణం ఏమిటి అనే ప్రశ్నలు ఉన్నాయి. పోలీసులు అజయ్ ని ఎందుకు తీసుకు వచ్చారు ? అజయ్ కి అక్రమ మద్యానికి సంబంధం ఏమిటి అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసుని తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని, కొంత మంది ప్రజా ప్రతినిధులు కూడా ఎంటర్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై దళిత సంఘాలు, ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసు పై పూర్తి వాస్తవాలు వెల్లడించాలని, వారు కోరుతున్నారు. అసలు అజయ్ ని ఏ సెక్షన్ కింద అదుపులోకి తీసుకున్నారు, ఆయన ఎలా చనిపోయారో చెప్పాలని వాపోతున్నారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/fj5xK9pc8ng