ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు భవనాలను తాకట్టు పెట్టడం అయిపోయింది . ఇప్పుడు తాజాగా ప్రభుత్వ దృష్టి పార్కుల మీద పడింది. ఇప్పుడు వీటిని తాకట్టు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది . విజయవాడలో కృష్ణ నదీ తీరాన్ని అనుకుని ఉన్న అత్యంత సుందరమైన బెర్మ్ పార్క్ ను తాకట్టు పెట్టారు. దీని గురించి ప్రశ్నించగా ఆ బెర్మ్ పార్క్ లో అభివృద్ధి చేయడానికి, అలాగే మిగతా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు ఈ పార్క్ ను తాకట్టు పెట్టమని ,దానితో వచ్చిన ఋణం తో అభివృద్ధి పనులు అన్నీ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఈ పార్క్ ను తాకట్టు పెట్టి 134 కోట్లు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే బ్యాంకులు దీనికి143 బ్యాంకు ఋణం మంజూరు చేసింది. అయితే మొదట విడతగా 30 కోట్ల ఋణం త్వరలోనే మంజూరు కానుంది. ఈ బెర్మ్ పార్క్ అనేది విజయవాడ లోనే అత్యంత సుందరమైన పార్క్ ,అంతే కాకుండా బోటింగ్ పాయింట్ కూడా ఉంది. అక్కడే నదిని అనుకుని కాటేజీలు కూడా ఉన్నాయి. ఒకవైపు ప్రకాశం బారేజి, మరోవైపు కృష్ణా నది అందాలను చూడటానికి ఈ కాటేజీలలో స్టే చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతం మాత్రం పర్యాటకులని బాగా ఆకర్షిస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు

jagan 11022022 2

గతంలో చంద్రబాబు ఉండగా, ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడే ఇంటర్నేషనల్ బోటింగ్ రేస్ కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ బెర్మ్ పార్క్ 5 ఎకరాలలో విస్తీర్ణంలో ఉంది. ఇటువంటి పార్క్ ను తాకట్టు పెట్టటానికి జగన్ ప్రభుత్వం సిద్దమయింది. అదేమిటని అడిగితే ఇవన్నీ అభివృది చేయడానికే తాము తాకట్టు పెట్టమని చెబుతుంది. టూరిజం అధికారులేమో ఎన్నో రోజుల నుంచి తాము అభివృద్ధి డబ్బులు అడిగితే ప్రభుత్వం మంజూరు చేయడం లేదని అందుకే ఈ పని చేయాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. అయితే ఈ బెర్మ్ పార్క్ తాకట్టు పై అటు పర్యాటకులు, ఇటు విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ పార్క్ మీద తీసుకున్న ఋణం అభివృద్ధి కే ఉపయోగిస్తారా , లేదంటే వేరే ఇతర పనులకి వాడతారేమో అని ఇటు ప్రతిపక్షాలు, అటు పర్యాటక ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పైగా నదీతీరం లో ఉన్న పార్కుని HDFC బ్యాంకు కి తాకట్టు పెట్టడాన్ని అందరూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read