విజయవాడ గ్యాంగ్ వార్ రోజు రోజుకు కొత్త విషయంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ నగర పోలీసులు 13మంది అరెస్ట్ చేసినట్లు విజయవాడ సీపీ ద్వారక తిరు మల రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. హతుడు తోట సందీప్ కు, కోడూరు మణికంఠకు రాజకీయంగా సంబంధాలున్నా, జరిగిన ఘటనకు రాజకీయ నాయకుల జోక్యం లేదని ఆయన ప్రక టించారు. అయితే ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై నిఘా పెడుతున్నట్లు ఆయన స్పష్టం చేసారు. సీపీ చెప్పిన కథనాన్ని అనుసరించి హతుడు సందీప్, పండు మంచి స్నే హితులు. యనమలకుదురులో ఒక స్థలంలో ప్లాటుకు సంబంధించి ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డి నడుమ వివాదాలున్నాయన్నారు. స్థిరాస్తి వ్యాపారంతో పాటు, సెటిల్మెంట్లు చేసే ట్రాక్టరు డీలరు నాగబాబు దగ్గరకు ఈ వ్యవహరం సెటిల్మెంటుకు చేరింది. దీంతో నాగబాబు తనతో సత్సం బంధాలున్న తోట సందీప్ ను ఈ విషయంలో సహకరించాలని కోరాడు, ఈ వ్యవహరమై ఈ నెల29న నాగబాబుకు చెందిన పెనమలూరులోని తన మిత్రుని స్థలంలో వంచాయతీ పెట్టారు.

దీనికి పండు ప్రదీప్ తరుపున హాజరయ్యారు. ఇది నచ్చని సందీప్ పండుకు ఫోన్ చేసి బెదిరిం చాడు. తన అనుచరులతో కలిసి అతని ఇంటిపైకి వెళ్లాడు. అక్కడ తీవ్రస్థాయిలో పండును దూషిస్తూ మాట్లా డటమే కాకుండా, ఆమెకు తీవ్రస్థాయిలో హెచ్చరి కలు చేసాడు. దీనికి ప్రతిగా పండు మరుసటిరోజు ఉదయం సందీప్ వ్యాపార దుకాణం పైకి తన అను చరులతో కలిసి వెళ్లి, అక్కడి గుమాస్తాను కొట్టా డు. అక్కడి నుంచే సందీపకు ఫోన్ చేసి బెదిరించాడు, అతని అంతుచూస్తానన్నాడు. ఈ నేపథ్యం లో తరువాత వండు మాట్లాడుకుందాంమని సందీపు పిలిపించాడు. అక్కడ జరిగిన ఇరు వర్గాల నడుమ పరస్పర దాడులు జరిగాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఆరు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలించి, ఈ నెల 4వ తేది రాత్రి రేవల్లె ప్రశాంత్, ఆకుల రవితేజ, ప్రేమ్ కుమార్, ప్రభు కుమార్, బోనోత్ శ్రీనునాయలను అరెస్ట్ చేసారు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన 13 మందిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీపీ తెలిపారు.

నిందితుల నుంచి కత్తులు, కోడికత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇకపై విజయవాడలో గ్యాంగ్ వార్లు, ఘర్షణలు పునరావృ తమైతే కఠినచర్యలు తప్పవన్నారు. అయితే ఇది ఇలా ఉంటే, కోడూరు మణికంఠ తీవ్ర గాయాలతో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో, చికిత్స పొండుతున్న సంగతి తెలిసిందే. కోడూరు మణికంఠ చికిత్స పొందుతున్న వార్డు దగ్గర, ఒక అజ్ఞాత వ్యక్తి తిరుగుతూ కనిపించారు. అతను ఎందుకు వచ్చారు అని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానం లేకపోవటంతో, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వార్డు బాయ్ కోసం వచ్చానని చెప్పగా, అది నిజమా కాదా అనేది పోలీసులు చూస్తున్నారు. మరో పక్క మణికంఠకు చికిత్స పొందుతున్న వార్డు దగ్గర, పటిష్ట బంధోబస్తు ఏర్పాటు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read