అప్డేట్ : లాక్ డౌన్ లేదని, కలెక్టర్ గారు, మళ్ళీ వెంటనే ఒక గంటకే ప్రకటించారు.

కృష్ణా జిల్లాలో పెరుగుతున్న క-రో-నా కేసులు దృష్టిలో పెట్టుకుని, జూన్ 26 నుంచి, అంటే శుక్రవారం నుంచి, విజయవాడ నగరం మొత్తం, పూర్తి లాక్ డౌన్ ఉంటుందని, వారం రోజుల పాటు ఈ లాక్ డౌన్ ఉంటుందని, పరిస్థితిని బట్టి అప్పుడు ఏమిటి అనేది ఆలోచిస్తామని, కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వచ్చే రెండు రోజులు, రేపు, ఎల్లుండి,నిత్యావసర వస్తువులను సమకూర్చుకోవాలని పిలుపిచ్చారు. మందులు షాపులు, కొన్ని నిత్యవసర షాపులు తప్పితే, అన్నీ ముసేస్తాం అని అన్నారు. ప్రజలు దీనికి పూర్తి సహకారం అందించాలని కోరారు. కృష్ణా జిల్లాలో పెరుగుతున్న కో-వి-డ్-19 దృష్ట్యా, నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, ఇంత వరకూ 61.35 శాతం ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో ఇంతవరకు 64,110 మందికి పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. మొత్తం 1115 పాజిటీవ్ కేసులు ఇంతవరకూ నమోదుకాగా, వాటిలో 684 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారని, 405 యాక్టివ్ కేసులు కాగా, వీరందరూ వైద్యసహాయం పొందుతున్నారని కలెక్టర్ అన్నారు. క-రో-నా నియంత్రణకు ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాలను పాటిస్తూ, జిల్లాలో ఉన్న 117 కంటైన్మెంట్ జోన్ లలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అన్నారు.

5 క్వారంటైన్ సెంటర్లలో 317 మంది ఉన్నారని, వీరందరికీ అవసరమైన భోజన, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని కలెక్టర్ అన్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతి రోజు 8 వేల కరోనా పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని, దీనిలో భాగంగా 20 వైద్య బృందాలు పనిచేస్తున్నావని, 10 ఐమాస్క్ బస్సులు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, స్వచ్చంధంగా ప్రజలు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ లను ధరించాలని భౌతిక దూరం పాటించడం వంటి స్వీయనియంత్రణ చర్యలు చేపట్టాలని అప్పుడే కరోనాను జయించగలమని కలెక్టర్ అన్నారు. కరోనా వైరస్ గురించి ప్రజల్లో ఉన్న బయాందోలనలను తొలగించేందుకు ఐదుగురు సైకాలజిసట్ లను జిల్లాలో నియమించాయని, వీరు క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికీ, ఫోన్ ద్వారా కరోనా వైరస్ గురించి ప్రజల్లో భయాందోళనలపై కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో మామూలు పరిస్థితులు ఉండేవిధంగా కృషి చేస్తారని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read