ప్రస్తుత ఆధునిక జీవితంలో, ఎవరికి వారు బిజీ బిజీ... చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి దాక అంతే.. ప్రపంచం అంతా మొబైల్ ఫోన్ లో, కంప్యూటర్ లు, ఇంటర్నెట్, ఫేస్బుక్.. ఇదే ప్రపంచం... ఆట పాత, సరదా ఏమి లేదు.. ఏది ఉన్నా అంతా సెల్ ఫోన్ లోనే... పాత రోజుల్లో అయితే, ఆ ఆటలే వేరు, ఆ సరదాలు వేరు... ఇప్పుడు సగటు మనిషికి ఇవన్నీ దూరం అవుతున్నాయి.. జనం దూరం చేసుకున్న, ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది విజయవాడలోని పీవీపీ మాల్... పాతతరం ఆటలను నేటి తరానికి దగ్గర చేస్తోంది పీవీపీ మాల్ లో ఉన్న ఆన్షియంట్ లివింగ్ స్టోర్... వీక్ ఎండ్స్ లో, ఈ వారసత్వ ఆటలను మన ముందు ఉంచింది.
దాడి, పులిమేక, అష్ట చెమ్మ, జిగ్గాట, వామన గుంటలు, పచ్ఛిస్, చైనీస్ చెక్కర్ ఆటలను ఇక్కడ మళ్ళీ అందుబాటులో పెట్టారు. అవి వచ్చిన వాళ్లు సరదాగా ఆడేయొచ్చు...అవసరమైతే అచ్చం అప్పటిలాగే పందాలు కూడా కాయొచ్చు...అంతేకాదు...ఈ ఆటలు రానివాళ్లు...నేర్చుకుందామని ఆసక్తి చూపేవాళ్లకి ఈ ఆటలను నేర్పడానికి శిక్షణ పొందిన సిబ్బంది కూడా అక్కడ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. పిల్లలంతా ఒక్కచోటుకి చేరి ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతుంటే ఎంతో ముచ్చటేస్తుంది. చక్కగా స్నేహితులతో ముచ్చటిస్తూ ఆడే ఆటల్లో ఎంత సంతోషం ఉందని ఈతరానికి తెలియాలి అని నిర్వాహుకుకు అన్నారు .
మన నేటివిటీ కి సంబంధించిన ఆటలన్నీ ఆడించడమే కాకుండా సహజసిద్ధ వస్తువలనే వాడాలి అనే సందేశాన్ని అందరికి తెలియచేస్తున్నారు పీవీపీ మాల్ లో ఉన్న ఆన్షియంట్ లివింగ్ స్టోర్ ప్రతినిధిలు. వీకెండ్ సందర్భంగా సరదాగా వచ్చిన వారంతా ఈ ఆటలను చూస్తూ ఆడుతూ సంబర పడిపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆడుతున్న ఈ ఆటలను గురించి వివరించడానికి అక్కడే ప్రతినిధులు ఉండటం తో ఆ ఆటను గురించి తెలుసుకొని మరి సరదాగా బెట్టింగ్లు పెట్టుకొని ఆనంద పడిపోతున్నారు. సిటీ లైఫ్ లో నిత్యం బిజీగా ఉండే పేరెంట్స్ కి.... వారమంతా చదువుల భారంతో అలసిన చిన్నారులకు పాతతరం ఆటలను పరిచయం చేస్తూ రెండుతరాల వారధిగా నిలుస్తోంది పీవీపీ ఆన్షియంట్ లివింగ్ స్టోర్.