ప్రత్యేక హోదా బోరింగ్‌ సబ్జెక్ట్‌ అంటూ విజయవాడ లోక్‌సభ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌(సీఐఐ) రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సీఐఐ రాష్ట్ర విభాగం చైర్మన్‌ విజయ్‌ నాయుడు గల్లా నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి వైసీపీ తరఫున పీవీపీ వచ్చారు. ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యేక హోదా అంశం ఓ బోరింగ్‌ సబ్జెక్ట్‌ అని, దానిపై తానేమీ మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించారు. సమావేశానికి హాజరైన వారు బిత్తరపోయారు. ఆయన వ్యాఖ్యలు కొద్దిసేపటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

pvp 21032019

ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్టు అని వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ నిర్వాకం వల్లే ఏపీలో లక్ష ఎకరాలు నిరుపయోగంగా మారాయని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా అన్నది వైసీపీ నేతలకు బోరింగ్ సబ్జెక్టుగా కనిపిస్తోందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను లోక్ సభ సభ్యులుగా గెలిపిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి 28,000 ఎకరాలు, లేపాక్షిలో మరో 8,808 ఎకరాలు, బ్రాహ్మణీ స్టీల్స్ కేసులో మరో 10,000 ఎకరాలు జగన్ వల్ల కేసుల్లో చిక్కుకుని నిరుపయోగంగా ఉండిపోయాయని చంద్రబాబు తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ డేటా చోరీకి భారీ కుట్ర చేశారనీ, ఫామ్-7 ద్వారా దాదాపు తొమ్మిది లక్షల ఓట్లను తొలగించేందుకు మరో కుట్ర చేశారని మండిపడ్డారు.

pvp 21032019

వైసీపీ అధినేత జగన్ కుట్రలు, డ్రామాలకు అంతేలేకుండా పోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. మోదీ మేలు కోసమే వైసీపీ లోక్ సభ సభ్యులు రాజీనామాలు సమర్పించారని పేర్కొన్నారు. ఎన్నికలు రాకుండా చూసి రాజీడ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా బోరింగ్ అంశమన్న విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీవీపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ, ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ సెటైర్లు వేశారు. "ప్రత్యేక హోదా బోరు కొట్టిందని వైసీపీ మనసులో మాట బైటికొచ్చింది. అంటే సాక్షిలో రాసేటివి దొంగ రాతలు, జగన్ నోట పలికేవి శుద్ధ అబద్దాలు, వైసీపీ ఎజెండా మొత్తం నీటి మూటలు అని తేలిపోయింది. జగన్ సారూ, కెసిఆర్ సారూ... ఇద్దరిదీ ఒకటే మాట ఏపీకి ప్రత్యేక హోదా వద్దు! అంతేగా!!" అని ఆయన ట్వీట్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read