విజయవాడ నుంచి సింగపూర్ నూతన సర్వీసు మొదలు పెట్టిన వేళ, మొదట్లో ఎదో రెస్పాన్స్ ఉంటుంది, తరువాత ఉండదు అని అధికారులు అనుకున్నారు. కాని సింగపూర్ నూతన సర్వీసుకు అనూహ్య స్పందన లభిస్తోంది. రెండువారాల్లో సింగపూర్ నుంచి సగటున 170మంది వరకు ఇక్కడికి వస్తున్నారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్ళే వారు సగటున 70 మంది ఉంటున్నారు. ఈ నెంబర్లు చూసి, అధికారులే షాక్ అవుతున్నారు. ఇంత రెస్పాన్స్ అసలు ఊహించాలేదని చెప్తున్నారు. సర్వీస్ మొదలు పెట్టిన కొత్తలో, సహజంగా ఉంటారు అనుకున్నామని, కాని రెండు వారలైన, అదే ఫ్లో ఉందని అంటున్నారు. రెండువారాల కిందట ప్రారంభించిన సింగపూర్ సర్వీసు దుమ్ము రేపడంతో విజయవాడలో వీసాకేంద్రం ఏర్పాటుకు సింగపూర్ కాన్సులేట్ ఆసక్తి చూపుతోంది. అతి త్వరలో వీసాకేంద్రం బెజవాడలో కొలువు తీరబోతోంది.
వీసాకోసం వీరు అటు బెంగళూరుకు కానీ, ఇటు హైదరాబాదుకు కానీ వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగానే వీసా కేంద్ర ఏర్పాటు చేస్తే విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణీకుల సంఖ్య మరింత పెరుగుతుందని ఏపీ ప్రభుత్వం భావించింది. దీనితో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీ ఏడీసీఎల్), సింగపూర్ కాన్సులేట్‌తో చర్చలు మొదలు పెట్టింది. దీనిపై సింగపూర్ కాన్సులేట్ కూడా సానుకూలంగా స్పందించింది. ఇదే జరిగితే అంతర్జాతీయ రాకపోకలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వటంతో, ప్రయాణీకులు కూడా సంతోషిస్తున్నారు. ఇక్కడే వీసా వచ్చేస్తే అంతకంటే, ఏమి కావాలని అంటున్నారు. సింగపూర్ కాన్సులేట్ చూపిన ఆసక్తివల్ల విజయవాడ నుంచి విదేశీయానానికి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కృషికి ఇదే నిదర్శనం.
విజయవాడలో రెండువారాల కిందట సింగపూర్‌కు విదేశీయానం ప్రారంభమైంది. తొలి అంతర్జాతీయ సర్వీసుగా సింగపూర్‌కు ఇండిగో విమానం నడుస్తోంది. వారంలో మంగళ, గురు రెండురోజుల పాటు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. సింగపూర్ సర్వీసుకు రాష్ట్రప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ప్రాతిపదికన ఇండిగో సంస్థకు బ్రేక్‌ఈవెన్ ఇవ్వటానికి కూడా చొరవతీసుకుంది. ఫలితంగా మార్గం సుగమం అయింది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, ఖమ్మం, ప్రకాశం జిల్లాలనుంచి ఐదులక్షల మంది విదేశాలలో ఉంటున్నారు. తరచూ ఇక్కడికి రాకపోకలు ఉంటున్నాయి. ప్రతిఏడాది 30 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యశించటానికి వెళుతున్నారు. ఉపాధికి వెళ్ళే వారిశాతం కూడా ఎక్కువుగా ఉంటోంది. హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్ళే ప్రతి 100మంది ప్రయాణీకులలో సగటున 46మంది ఈ ప్రాంతం వాళ్ళే ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సింగపూర్ సర్వీసుకు ఆదరణ ఉండటం, రానున్న రోజుల్లో మరింత వృద్ధి నమోదయ్యే అవకాశం ఉండటంతో సింగపూర్ కాన్సులేట్ నిర్ణయం తీసుకుంది.