విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటూరి వారి వీధిలో సాయి చరణ్ జ్యూయలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసులో మిస్టరీని బెజవాడ పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. ఈ సందర్భంగా విజయవాడ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ఒన్ టౌన్, కాటూరి వారి వీధిలో రాజు సింగ్ చరణ్ అనే వ్యక్తి 2 సంవత్సరాలుగా సాయి చరణ్ జ్యూయలరీ షాపును నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలంలో లాక్ డౌన్ నేపథ్యంలో వ్యా పారం జరగకపోవడంతో 19 కిలోల వెండి వస్తువులు, రూ. 20 లక్షల నగదును షాపు వద్దనే ఉంచి, తన స్నేహితుడైన గురు చరణ్ జ్యుయలరీ షాప్ యజమాని అయిన మనోహర్ సింగ్ రాతోర్‌కు చెందిన 7 కిలోల బంగారపు ఆభరణాలు, రూ.22 లక్షల నగ దును కూడా అదే షాపులో ఉంచాడు. లాక్ డౌన్ నేపథ్యంలో తన షాపు వద్ద వనిచేసే రెగ్యులర్ వర్కర్ స్వగ్రామానికి వెళ్ళి పోవడంతో, తనకు తెలిసిన మధుధాన్ అనే వ్యక్తి ద్వారా రాజస్థాను చెందిన విక్రం కుమార్ లోహాను 40 రోజుల క్రితం పనిలోకి చేర్చుకున్నాడు. పెద్ద మొత్తంలో నగదు, బంగారం ఉండటంతో గురువారం రాత్రంతా ఫిర్యాది షావులోనే ఉన్నాడు.
శుక్రవారం ఉదయం 9 గంటలకు తన ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో మనోహర్ సింగ్ రాతోర్ వద్ద పనిచేసిన గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఆభరణాల కోసం సాయి చరణ్ జ్యూయలరీ షాప్ వద్దకు వెళ్ళాడు. అక్కడ సదరు విక్రం కుమార్ లోహార్ కాళ్ళు చేతులు కట్టివేయబడి ఎడమ చేతికి గాయం అయి అపస్మారక స్థితిలో ఉండటం గమనించి షావు యజమానికి సమాచారం అందించాడు. ఫిర్యాది షావు వద్దకు వెళ్ళి పరిశీలించగా షాపులో ఉండాల్సిన 7 కిలోల బంగారపు వస్తువులు, 19 కిలోల వెండి వస్తువులు, రూ.42 లక్షల నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లుగా విక్రం కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు షాపు యజమాని తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డిసిపి విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు వెస్ట్ డివిజన్ ఎసిపి కె.సుధాకర్ పర్యవేక్షణలో ఒన్ టౌన్ ఇనస్పెక్టర్ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నేరస్థలం అయిన సాయి చరణ్ జ్యుయలరీ షాపును పరిశీలించగా నేర స్థలంలో ఒక రహస్య ప్రాంతంలో ఉండాల్సిన సిసి కెమేరాలకు సంబంధించిన డిడిఆర్ కన్పించక పోవడం, సమీపంలో ఉన్న సిసి కెమేరాలు వరిశీలించగా కొత్త వ్యక్తులెవరు షావు నుండి బయటకు రావడం కనిపించక పోవడంతో, షావు లో వనిచేసే గుమాస్తా విక్రం కుమార్ లోహాన్ చెప్పిన కట్టుకథపై అనుమానం వచ్చింది.
విచారణ లో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో విక్రంకుమార్ చేసిన నేరం బట్టబయలైంది. శుక్ర వారం ఉదయం షావు యజమాని బయటకు వెళ్లిన వెంటనే బంగారం, వెండి, నగదును దొంగిలించి షాపు క్రింద రిపేరులో ఉన్న ఇంటిలో దాచి, షావు సిసి కెమేరాలను కూడ దొంగిలించి ఇంటి ఎదురు డ్రైనేజిలో పడేసి మరల షాపు వద్దకు వచ్చి బ్లేడ్ తో తనంతట తానుగా ఎడమ చేతికి గాయం చేసుకొని షావులో ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేసి బయట నుండి దొంగలు వచ్చి తనపై దాడి చేసి తనను కట్టేసినట్లుగా షావులో ఉన్న సీటితో తనంతట తానుగా చేతులు కాళ్ళు కట్టేసుకొన్నానని విచారణలో విక్రంకుమార్ వెల్లడించాడు. అతనిని అరెస్ట్ చేసి ఆతను దాచిన చోట నుండి 7 కిలోల బంగారు, 19 కిలోల వెండి, రూ.42లక్షల నగదు ఉన్న బ్యాగులను, తనకు తానుగా గాయం చేసుకోవడానికి ఉపయోగించిన బ్లేడును స్వాధీనం చేసుకున్నట్లు సిపి శ్రీనివాసులు వెల్లడించారు. సంఘటనా స్థలంలో విక్రం కుమార్ వ్రేలి ముద్రలున్న బాన్లు , సెల్ ఫోన్ తదితర వస్తు వులను కూడ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.