ఈ రోజు రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజాన చౌదరి ప్రసంగిస్తూ, విభజన హామీల పై కేంద్రం అన్యాయం చేస్తుంది అని, ఇన్ని రోజులు నుంచి ఆందోళన చేస్తున్నా, కేంద్రం స్పందించలేదు అంటూ ప్రసంగించారు... అయితే సుజనా చౌదరికి ఒక ఆంధ్రా ఎంపీగా సపోర్ట్ చెయ్యల్సింది పోయి, వైసిపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సుజనా చౌదరినే విమర్శించారు... కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉండి రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎలా వ్యతిరేకిస్తారంటూ, అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన ఎలా వ్యక్తం చేస్తారంటూ కేంద్రమంత్రి సుజనా చౌదరిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
కేంద్రంపై విశ్వాసం లేకపోతే సుజనా చౌదరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు.. రాజ్యసభలో రూల్ 238-1, రూల్ 238-2, రూల్ 238-ఏ కింద పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తామని అన్నారు. ... ఒక పక్క క్యాబినెట్ లో ఎందుకు వ్యతిరేకించలేదు అంటూనే... ఇంకో పక్క రాజ్యసభలో ఎందుకు వ్యతిరేకిస్తున్నావ్ అంటూ, విజయసాయి మాట్లాడారు... అయితే ఇదే విషయం పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, సీట్లో కూర్చోవాలని విజయసాయికి సూచించారు...
తరువాత బయటకు వచ్చి మీడియా ముందు, విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వెంకయ్య తీరును తప్పుబట్టారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పై రాజ్యసభ ఛైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఛైర్మనే... నిబంధనలను అమలు చేయకపోతే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అన్నారు... ఒక నిజాయితీ గల వ్యక్తికి, కష్టపడి ఉప రాష్ట్రపతి స్థాయి దాకా వచ్చిన వ్యక్తి పై, విజయసాయి లాంటి A2 కేసులు ఉన్న వాళ్ళు, ఫిర్యాదు చేస్తా అనటం వింతగా ఉంది...