ఇన్నాళ్ళు అయ్యా !బాబూ!అంటూ విభజన హామీలు నెరవేర్చమంటే, ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు లోకువగా కనిపించాడు.... లోక్‌సభ లో సరిపడా మెజారిటీ ఉండనే ధీమాతో, లోపలా, బయట మిత్రపక్షాలని హీనంగా చూసారు... పార్టీ సీనియర్లు తో సహా నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు ని ఘోరంగా అవమానించారు... అవహేళన చేసారు... ఇంకా చేస్తున్నారు... కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయి, తమకు తిరుగేలేదనుకుని విర్రవీగారు...ఎంతకు దిగజారారంటే, A1,,A2 జతకట్టి, ఇంకొక అజ్ఞానవాసితో రహస్య ఒప్పందం చేసుకుని... చంద్రబాబు ని తొక్కుదామనుకున్నారు... కేంద్రం లో తమ అధికారం శాశ్వతమనుకున్నారు... కాని ఇక్కడ బీజేపీ చెయ్యల్సింది, ఇలాంటి వారిని నామ్ముకోవటం కాదు, ఆంధ్రాకి న్యాయం చెయ్యటం... అలా చేస్తే, ఇటు ప్రజలు, ఇటు చంద్రబాబు, ఇద్దరూ బీజేపీతోనే ఉండేవారు... కాని జరగలేదు...
ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయం పై చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష అంటూ, ప్రతి జిల్లాలో సభలు పెట్టి, మోడీ ని లెఫ్ట్ రైట్ వాయిస్తున్నారు... నిన్న వైజాగ్ లో కూడా ఒక సభ పెట్టారు... బీజేపీ నాయకులు చేస్తున్న ఫేక్ ప్రాపగాండా ఎండగట్టారు... మోడీతో సహా అందరు చెప్పివి పచ్చి అబద్ధాలు అని చెప్పారు... చెప్పటం మాత్రమే కాదు, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా, మోడీ చేసిన మోసాన్ని రాష్ట్ర ప్రజలు ముందు ఉంచారు... ఆంతే కాదు, మోడీతో కలిసి, ఇక్కడ రెండు పార్టీలు చేస్తున్న నమ్మక ద్రోహం పై కూడా ప్రజలకు వివరించారు.. ప్రజల ఆకాంక్ష మేరకు, విభజన హామీలు అన్నీ నేరవేర్చలాని వైజాగ్ సభ సాక్షిగా చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేసారు...
అయితే, చంద్రబాబు మీటింగ్ పెట్టి మోడీని ఉతికి పడేస్తే, వెరైటీగా వైసిపీ స్పందించింది... రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్దగా చంద్రబాబుకి కౌంటర్ ఇవ్వలేదు... చంద్రబాబు మీటింగ్ అయిన వెంటనే, అదేదో తమ పార్టీని, తమ నాయకుడిని అన్నట్టు, విజయసాయి రెడ్డి స్పందించారు... నిన్న చంద్రబాబు సభ పెట్టటం అన్యాయం అని, మా మోడీని తిడతారా అంటూ విజయసాయి రెడ్డి ఈ రోజు హడావిడి చేసారు... మా మోడీని తిట్టిన చోటుని గంగా జాలంతో శుభ్రం చేస్తాను అంటూ, ఒక చెంబు పట్టుకుని బయలుదేరాడు.. అయితే, పోలీసులు అడ్డుకుని లోపల వేసారు... మోడీని చంద్రబాబు ఎదో అంటే, వైసిపీ నాయకులకి ఎందుకు నొప్పి ? వీళ్ళకు కొత్త ఉద్యోగం ఏమన్నా ఇచ్చారా ? వీళ్ళకు మోడీ అంటే ఎలాగూ భయం, అలాంటిది, కేంద్రం పై పోరాటం చేస్తున్న చోటుని, గంగా జలంతో కడుగుతావా ? సరేలే అరెస్ట్ అయిన ఫోటోలు ఢిల్లీకి పంపించు... శుక్రవారం బాధ ఎమన్నా తప్పుతుంది ఏమో...