కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఉరుకులు పరుగులు పెడుతూ జీవనం సాగించిన ప్రజలు, కనీవినీ ఎరుగని రీతిలో, ఇళ్ళకే పరిమితం అయిపోయారు. దాదాపుగా, 40 రోజుల పాటు ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఇక కరోనా పుణ్యమా అని, పక్క ఇంటి వారితో మాట్లాడాలి అన్నా హడలి పోయే పరిస్థితి వచ్చింది. శుభకార్యం లేదు, దినం కార్యం లేదు, దేనికీ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇక మరణాల విషయానికి వస్తే, ఎంత సాధారణ మరణం అయినా సరే, కరోనా వల్ల ఏమో అనే డౌట్ వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంది. మొన్న ఒక ప్రముఖ వ్యాపారి, చనిపోతే, కరోనా వల్ల చనిపోలేదు, ఇదిగోండి, నెగటివ్ రిపోర్ట్ అని, బ్యానర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఉంది, ఇప్పుడు వాతావరణం. అందరినీ అనుమానంతో చూడాల్సిన పరిస్థితి. చనిపోయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేసి, అప్పుడు కాని, బాడీ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. అయితే, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఒక్కోసారి మనం చేసిన నిర్ల్యక్షంతో, కరోనా కాటు వేస్తుంది.

ఇప్పుడు విజయవాడలో జరిగిన సంఘటనే ఉదాహరణ. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇలాంటి ఒక్క సంఘటన చాలు, మొత్తం ఇబ్బందుల్లో పడటానికి. విజయవాడకు చెందిన ఒక వృద్ధురాలు ఇటీవల మరణించారు. అయితే, ఆమె అంత్యక్రియలు అయిపోయే దాకా, ఆమెకు కరోనా ఉండనే విషయం ఎవరికీ తెలియదు. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న వారు, పరామర్శకు వచ్చిన వారు అందరూ షాక్ అయ్యారు. విజయవాడ గాంధీనగర్ కు చెందిన ఒక 75 ఏళ్ళ వృద్దురాలు, ఇటీవల గుండె జబ్బుతో బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఏప్రిల్ 11నా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఆమెకు గుండెకు సంబంధించన ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్లు. అయితే ఆమె ఆరోగ్యం విషమించటంతో, ఆ తరువాత రోజే మరణించారు.

దీంతో ఆమె మృతదేహం తీసుకు వచ్చి, అంత్యక్రియలు చేసారు కుటుంబ సభ్యులు. పేరు ఉన్న కుటుంబం కావటంతో, విజయవాడకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరుఅయ్యారు. అయితే, గవర్నమెంట్ హాస్పిటల్ కావటంతో, ఆమె మృతదేహం అప్పగించే ముందు కరోనా పరీక్షలు చేసారు. అయితే, ఈ రిపోర్ట్ మాత్రం రెండు రోజుల క్రితం వచ్చాయి. దాంట్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒకేసారి అందరూ షాక్ తిన్నారు. ఆమె కుటుంబ సభ్యులను, పని వాళ్ళని, కూడా క్వారంటైన్ కు తరలించారు. ఆమె హాస్పిటల్ లో ఉన్నప్పుడు పరామర్శించిన వారిని, చనిపోయినప్పుడు వచ్చిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.కొంత మంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఆమెకు కరోనా ఎలా సోకింది అనే విషయంలో ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతం అంతా రెడ్ జోన్ గా ప్రకటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read