అధికార పార్టీలో ఉంటే, ఎక్కడ లేని హోదా వచ్చేసింది. ఎక్కడి లేని పవర్స్ అన్నీ మాకే ఉన్నాయని అనుకుంటున్నారు. తాము సామాన్య ప్రజలం కాదని, అతీత శక్తులం అనుకుంటున్నారు. అందుకే అధికార దర్పం చూపిస్తూ, అధికారుల పై కూడా జులం చూపిస్తారు. ఆ అధికారి ఎంతో ఉన్నతమైన పోస్ట్ అయిన ఐఏఎస్ అయినా లెక్క చెయ్యని, రాజకీయ నాయకులను మనం చూస్తూనే ఉంటాం. అయితే అధికారులు మాత్రం, చాలా వరకు తమాయించుకుంటారు. అవతల నాయకుడు ఎలాంటి వాడు అయినా, వీళ్ళు ఐఏఎస్ లు అయినా, ఆ నాయకుడుకి గౌరవం ఇవ్వాల్సిందే. ఎంత తిట్టినా పడే వాళ్ళు ఉంటారు. కాని కొంత మంది అధికారులు మాత్రం ఆత్మాభిమానం చంపుకోరు. తమ పదవి కంటే, విధులు పర్ఫెక్ట్ గా నిర్వహించటం వారికి ముఖ్యం.

vinukonda 02082019 2

ఇలాంటి సంఘటనే, గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో జరిగింది. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బొల్లాపల్లి మండల తహసీల్దార్ అదిరిపోయే షాక్ ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సమక్షంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించారు. ఎమ్మెల్యే, త‌హ‌సీల్దార్ మధ్య గొడవ పెరగటంతో, జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని, సమస్యని పరిష్కరించాల్సి వచ్చింది. శుక్రవారం బొల్లాపల్లి మండలంలో ఎమ్మెల్యే అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల సర్వే నెంబర్లు ఆన్‌లైన్‌లో ఎందుకు నమోదు చెయ్యలేదు, ఎందుకు ఆలస్యం అయ్యింది అంటూ, అక్కడే ఉన్న రెవెన్యూ అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

vinukonda 02082019 3

రైతులకు న్యాయం చేయలేని ఉద్యోగాలు ఎందుకు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. అధికారులు సరిగ్గా పని చేయకపోతే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈ సమస్య ఎందుకు ఆలస్యం అయ్యిందో చెప్పాలి అంటూ, తహసీల్దార్‌ బాలకృష్ణను నిలదీసారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే మాటలకు అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు తహసీల్దార్‌ బాలకృష్ణ. నేను ఇక్కడకు బదిలీ పై వచ్చి 10 రోజులే అయింది, ఇప్పటివరకు తన వద్ద ఏది పెండింగ్‌లో లేదు అంటూ సమాధానం ఇచ్చారు. నా నిబద్ధత, నిజాయతీ చూసి కలెక్టర్‌ ఏరికోరి బొల్లాపల్లికి బదిలీ చేశారని, మీకు నేను ఇక్క‌డ ప‌ని చేయ‌టం ఇష్టం లేక‌పోతే వెళ్ళిపోతానని చెప్పారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మిమ్మల్ని వెళ్లమని చెప్పడం లేదు, సమస్య పరిష్కరిం చెయ్యండి అంటూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో తహసీల్దార్‌, ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగటంతో, జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ జోక్యం చేసుకొని వివాదం పెద్దది అవకుండా చూసారు. అయితే ఎమ్మెల్యే మాత్రం, ఈ విషయాన్ని, ప్రభుత్వ పెద్దల దగ్గరే తేల్చుకుంటా అని చెప్పినట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read