నవ్యాంధ్ర రాజధానిలోని మందడం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో వర్చువల్ క్లాస్‌రూమ్‌‌లను ముఖ్యమంత్రి పరిశీలించారు. వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. వర్చువల్ క్లాస్‌రూమ్‌‌ల ఏర్పాటుపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం ఆన్ లైన్ ద్వారా 20 పాఠశాలల విద్యార్థులకు స్వయంగా డిజిటల్ పాఠాలు బోధించారు. 40 స్టూడియోల ఏర్పాటు చేసి ఒక్కొక్క స్టూడియోలో 10మంది సబ్జెక్టు నిపుణులు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఉంటారని తెలియజేశారు.

cbn class 24112017 2

దాదాపు 5 వేల పాఠశాలలను డిజిటైజేషన్ కు అనుసంధానం చేస్తున్నామని, దీని వలన విద్యార్థులలో ఆలోచన విధానం, విషయ పరిజ్ఞానం పెరగడంతోపాటు వారికి అర్ధమయ్యే రీతిలో బోధన ఉంటుందని తెలిపారు. ప్రతి పాఠశాలకు 15 ఎంబీపీఎస్ స్పీడుతో ఫైబర్ నెట్ కనెక్షన్, వర్చువల్ క్లాస్‌రూమ్‌ ద్వారా చెప్పే పాఠాలను టీవీ ద్వారా మళ్లీ ప్లే చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం ద్వారా తల్లిదండ్రులు పిల్లల హాజరును స్వయంగా తెలుసుకోవచ్చన్నారు.

రాష్ట్రంలో తొలి వర్చువల్ క్లాస్‌రూమ్‌గా మందడం హైస్కూల్ చరిత్రకెక్కినందున ఫలితాల్లో కూడా ఈ పాఠశాల ముందంజ వేయాలని విద్యార్థులను సీయం కోరారు. ప్రతి పాఠశాలకు ఒక టీవీ. వర్చువల్ క్లాస్‌రూమ్‌ ద్వారా చెప్పే పాఠాలను టీవీ ద్వారా మళ్లీ మళ్లీ ప్లే చేసుకునేందుకు వీలు ఉంటుంది. సాధారణ పద్ధతిలో ఉపాధ్యాయుడు గంటసేపు చెప్పగలిగే పాఠ్యాంశాన్ని వర్చువల్ క్లాస్ రూమ్ పద్ధతిలో 10 నిమిషాల్లో విద్యార్థి అవగాహన చేసుకునే వీలు ఉంటుంది. మందడం హైస్కూల్‌లో టాయిలెట్లు, ప్రహరీ, విద్యుత్ సదుపాయాలతో పాటు, క్లాస్‌రూమ్స్ రిపేర్లు, ల్యాండ్ స్కేపింగ్‌తో మంచి ఉద్యానవనంగా తీర్చిదిద్ది, ఆటస్థలాన్ని అభివృద్ధి చేసి మందడం స్కూలును ఒక మోడల్ స్కూల్‌గా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read