బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. ఇది ఇరు పార్టీల్లోను చర్చకు దారి తీసింది. ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన తరువాత తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తానని విష్ణుకుమార్‌రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖకు రైల్వే జోన్‌ కేటాయించినా ఎందుకనో ఆయన సంతృప్తిగా లేరని పార్టీ వర్గాల సమాచారం. విశాఖ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని, గతంలో అవకాశం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడంతో దానిపై చర్చించేందుకే సీఎంను కలిశారనే ప్రచారం జరుగుతోంది.

vishnu 07032019 2

అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... సీఎంను కలిసిన విష్ణు తాను బీజేపీలోనే కొనసాగుతానని, తెలుగుదేశంలోకి రానని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతల వద్ద ప్రస్తావించినట్టు ఒక ఎమ్మెల్యే ధ్రువీకరించారు. దీని పై విష్ణుకుమార్‌ను ప్రశ్నించగా, రాజకీయాల గురించి మాట్లాడేందుకు సీఎంను కలవలేదని, కొన్ని నిధులు, పనుల విషయమై చర్చించేందుకు కలిశానని వివరించారు. అయితే విష్ణుకుమార్ రాజు కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కాంట్రాక్టు లు ఉండటం, వాటిని బూచిగా చూపించి, టీఆర్ఎస్, బీజేపీ బెదిరిస్తున్నారేమో, అని కొంత మంది తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. ఎలా అయితే కొంత మందిని బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారో, అలాగే విష్ణు కుమార్ రాజుని పార్టీ మారకుండా చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది.

vishnu 0703201 39

ఇదిలావుండగా విష్ణుకుమార్‌రాజుకు ఢిల్లీ నుంచి పార్టీ పిలుపు వచ్చింది. అర్జెంట్‌గా ఢిల్లీకి రావాలని వర్తమానం అందడంతో ఆయన గురువారం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అమిత్‌షాతో పాటు ఇతర పార్టీ నాయకులను కలవనున్నట్టు తెలిపారు. అయితే బుధవారం రాత్రి ఆయన మీడియాకు ఫోన్‌ చేసి తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నానని, విశాఖపట్నం వచ్చాక పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. కొన్నాళ్లు ఆయన టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటు కూడా ఆశిస్తున్నారనే ప్రచారమూ జరిగింది. మరి ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో, ఈ ఒత్తిడిలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read