వి-వే-క కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. చాలా రోజులు తరువాత సిబిఐ విచారణ మళ్ళీ మొదలు పెట్టింది. గత ఆరు రోజులుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా వి-వే-క డ్రైవర్ అక్కడ పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ లను ప్రతి రోజు విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ పెద్ద తలకాయల వరకు సిబిఐ విచారణ రాలేదు. సునీత చాలా మంది ప్రముఖుల పై అనుమానం వ్యక్తం చేసినా, వారి దాకా ఇంకా విచారణ రాకపోవటం, విచారణ జరుగుతున్న తీరు పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఏకంగా సునీత కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ దీని పై విచారం వ్యక్తం చేసారు. సిబిఐ విచారణ నెమ్మదిగా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. ఇది ఇలా ఉంటే, గత ఆరు రోజులు నుంచి విచారణ చేస్తున్న సిబిఐ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కారు చుట్టూ విచారణ జరుగుతుంది. ఒకరిని విచారణ చేస్తుంటే, మరొకరి ఆధారం దొరుకుతుంది. అక్కడ నుంచి మరొక లింక్ దొరుకుతుంది. మొత్తానికి ఈ కేసు ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు మధ్య నడుస్తుంది కానీ, అసలు వాళ్ళు ఎవరో ఇప్పటికీ సిబిఐ విచారణ చేయలేక పోయింది. ఇక తాజాగా ఒక కారు చుట్టూ జరుగుతున్న విచారణతో, కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

vivek 13062021 2

కడప, పులివెందులలో రెండు సిబిఐ బృందాలు విచారణ చేస్తున్నాయి. పులివెందుల విచారణలో, వైసీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కొత్తగా తెర పైకి వచ్చారు. నిన్న కిరణ్, సునీల్ అనే వారి నివాసానికి వెళ్లి వారిని ప్రశ్నించారు. హ-త్య- జరిగే 15 రోజులు ముందు, సునీల్ , వి-వే-క-ను కలిసినట్టు అధికారులు గుర్తించారు. వివేక హ-త్య- ముందు రోజు ఆ ప్రాంతంలో తిరిగిన కార్ల వివరాల పై సిబిఐ ఆరా తీసింది. ఆయన నివాసం చుట్టూ కొన్ని కార్లు తిరిగినట్టు గుర్తించారు. అయితే ఒక ఇన్నోవా కారు పై మాత్రం సిబిఐ అధికారులు ఎక్కవ ఫోకస్ పెట్టారు. దాని యజమాని రవి, డ్రైవర్ గోవర్ధన్ ను విచారణ చేస్తున్నారు. వీరి ద్వారా వచ్చిన సమాచారం రికార్డు చేసారు. కేసు విచారణలో ఈ కారు కీలకమైనదిగా గుర్తిస్తున్నారు. ఆ కారులో ఎవరు వచ్చారు అనే దాని పై సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే మరి కొన్ని వాహనాల పై కూడా అనుమానం ఉండటంతో, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ను పిలిచి ఆ వాహనాలకు సంబందించిన వివరాలు సేకరిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read