గత 19 రోజులుగా సిబిఐ, వి-వే-క కేసులో విచారణ చేస్తూనే ఉంది. అయితే గతంతో పోల్చితే ఈ సారి మాత్రం సిబిఐ దూకుడు పెంచిందని తెలుస్తుంది. ఇప్పటికి నాలుగు సార్లు విచారణ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ, గతంలో సాదా సీదాగా విచారణ చేసి వెళ్ళిపోయేది. అయితే ఈ సారి మాత్రం సిబిఐ కొత్త కోణంలో విచారణ చేస్తుంది. ఒక కొత్త లేడి ఆఫీసర్ కూడా టీంలో చేరినట్టు చెప్తున్నారు. ఈ సారి విచారణలో చాలా మంది కొత్త వారు తెర పైకి వచ్చారు. పులివెందులలోనే కాకుండా, కడప జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 19 రోజులుగా ఈ సారి విచారణ కొనసాగుతుంది. మాజీ ఎంపీటీసి సుధాకర్ రెడ్డిని ఇప్పటి వరకు విచారణ చేసారు. మరో కోణం ఏమిటి అంటే, బృందాలుగా విడిపోయిన సిబిఐ, మధ్యానం వరకు మాత్రమే విచారణ చేస్తూ, మధ్యానం నుంచి ఫీల్డ్ లోకి వెళ్లి విచారణ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ, అనుమానం ఉన్న చోట, కూపీ లాగుతున్నారు. మొత్తం పులివెందుల అంతా తిరిగి, తరువాత రోజు విచారణకు ఎవరు రావాలి అనేది లోకల్ పోలీసులకు చెప్తున్నారు. గతంలో కాకుండా, ఈ సారి చాలా మంది కొత్త వ్యక్తులను పిలిపించి విచారణ చేస్తున్నారు. బెంగుళూరులో కూడా విచారణ జరిపినట్టు తెలుస్తుంది.

viveka 25062021 1

అలాగే వి-వే-క కూతురు సునీతను, పులివెందులలో ఆమెను మూడు సార్లు పిలిపించి, ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే గతంలో సునీత రెడ్డి, 15 మంది అనుమానితులు పేర్లు ఇచ్చింది. అందులో వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర వైఎస్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఆ లిస్టు లో ఉన్న వారిని అయితే ఇప్పటి వరకు విచారణకు పిలిపించలేదు. కీలక వ్యక్తుల వద్దకు వెళ్ళే ముందు, ముందుగా పక్కా సమాచారం సేకరించి, పూర్తి ఆధారలతోనే వారిని విచారణకు పిలుస్తారని తెలుస్తుంది. సునీత ఇచ్చిన అనుమానితులు పేర్లు అన్నీ పెద్ద వాళ్ళు కావటం, పదవుల్లో ఉండటంతో, రిస్క్ తీసుకో కుండా, మొత్తం ఆధారాలు ఉంటేనే వారిని పిలిచేలా వ్యూహం రచించారు. మొత్తం మీద అయితే గతానికి భిన్నంగా, సిబిఐ విచారణ ఈ సారి కొనసాగుతుంది. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, సిబిఐ టీంలోకి ఒక కొత్త లేడీ ఆఫీసర్ రావటం, ఆమె ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండటంతో, ఈ సారి సిబిఐ సీరియస్ గా ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read