వైఎస్ వి-వే-కా కేసు విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది కానీ, బాబాయ్ ఎలా చనిపోయాడు అనే విషయం, అబ్బాయ్ జమానాలో కూడా తెలియటం లేదు. సిబిఐ అధికారులు ఇప్పటికి అయుదు విడతలుగా కడప వచ్చి విచారణ చేసారు. అయితే ఐదో విడత మాత్రం, గత 38 రోజులుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణ మొత్తం, డ్రైవర్, వాచ్మెన్, తోటమాలి, ఇలా చిన్న చిన్న వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. సునీత లేవనెత్తిన అనుమానితులను ఇప్పటి వరకు సిబిఐ విచారణ చేయలేదు. దీని పై అనేక విమర్శలు వస్తున్నాయి కూడా. అయినా సిబిఐ మాత్రం, తమ విచారణను, తమ స్టైల్ లోనే చేస్తుంది. రాజకీయ పరమైన కేసు కావటంతో, ఒక పధ్ధతి ప్రకారం విచారణ చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే , నిన్న ఈ కేసుకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ నెలకొంది. కడప జిల్లాకు చెందిన సుబ్బారాయుడు అనే వ్యక్తి రాసిన లేఖ బయటకు రావటంతో , ఇప్పుడు ఈ అంశం మరో టర్న్ తీసుకునే అవకాసం ఉంది. సుబ్బారాయుడు అనే వ్యక్తి కడపకు చెందిన వ్యక్తి. న్యాయవాది వృత్తిలో ఉన్నారు. వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారనే ప్రచారం ఉంది. అయితే ఈయన మొత్తం రెండు లేఖలు రాసారు. ఈ లేఖలు ఇప్పుడు బయట పడటంతో, విచారణలో ట్విస్ట్ నెలకొంది.

viveka 13072021 2

ఈయన సిబిఐ సెంట్రల్ గ్రీవెన్ సెల్‌ కు లేఖ రాసారు. సిబిఐ దగ్గర వి-వే-క కేసుకు సంబందించిన సాక్ష్యాలు కానీ, ఇతర వివరాలు ఏమైనా ఉంటే తమకు చెప్పాలి అంటూ ఆయన సిబిఐని విజ్ఞప్తి చేసారు. అలాగే మరో సంచలన విషయం ఏమిటి అంటే, వి-వే-క కుమార్తె సునీత పై కూడా అనుమానం ఉందని, ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయాలి అంటూ, ఆయన లేఖలో తెలిపారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఈ లేఖల విషయం సునీతకు తెలియటంతో, ఆమె అలెర్ట్ అయ్యారు. వెంటనే కడప ఎస్పీకీ ఫిర్యాదు చేసారు. సుబ్బారెడ్డి పై ఫిర్యదు చేసారు. అసలు ఈ సుబ్బారెడ్డి ఎవరు ? ఎందుకు లేఖ రాసారు ? సిబిఐ సేకరించిన సాక్ష్యాలు ఎందుకు అడిగారు ? అందరూ ఆశ్చర్య పోయే విధంగా సునీత పై కూడా అభియోగాలు మోపి, ఆమెను కూడా విచారణ చేయమనటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. మరి ఈ విషయంలో అటు సిబిఐతో పాటు, ఇటు పోలీసులు ఏమి చేస్తారో చూడాలి. అసలు ఈ సుబ్బారెడ్డి ఎవరో, ఆయనకు ఈ కేసు పై ఇంట్రెస్ట్ ఏమిటో తెలియాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read