గత వారం రోజులు నుంచి తిరుపతి ప్రచారం కంటే కూడా, వి-వే-క కేసు , ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వివేక కూతురు సునీత, నిస్సహయత వ్యక్తం చేస్తూ, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టటం, ఆమె అనేక అనుమానాలు వ్యక్తం చేయటంతో, విమర్శలు అన్నీ జగన్ వైపు సంధించే పరిస్థితి వచ్చింది. సవాళ్ళతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నా, జగన్ మోహన్ రెడ్డి మాతం ఈ విషయం పై ఏమి మాట్లాడటం లేదు. లోకేష్ మాట్లాడుతూ, తమ పై విమర్శలు చేస్తున్నారని, ఆ కేసుతో తమ కుటుంబ సభ్యులు ఎవరికీ సంబంధం లేదని వెంకన్న పై ప్రమాణం చేస్తాం, జగన్ కూడా మా కుటుంబంలో ఎవరికీ సంబంధం లేదని ప్రమాణం చేయాలి అంటూ, సవాల్ విసిరారు. అయితే దీని పై, అటు వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇవన్నీ పక్కన పెడితే, వైఎస్ సునీత, సిబిఐ విచారణ నెమ్మదిగా జరగటం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఏకంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టటంతో, జాతీయ మీడియాలో కూడా ఇది రావటంతో, సిబిఐ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు ఉంది. తమ పై వస్తున్న విమర్శలు చేరిపెసేందుకు, సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ అధికారుల బృందం గత రాత్రి, ఢిల్లీ నుంచి పులివెందుల చేరుకుంది. వచ్చీ రాగానే సిబిఐ రంగంలోకి దిగింది. వివేక ఇంటి చుట్టు పక్కన ఉన్న ప్రజలను, వివేక పీఏని, డ్రైవర్ ని విచారణ చేసినట్టు సమచారం వస్తుంది.
మరి కొంత మందిని కూడా సిబిఐ ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కొంత మంది సెల్ ఫోన్స్ కూడా ఇప్పటికే సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఒక సెల్ ఫోన్ షాపు యజమానిని కూడా విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఈ సారి కొంత మందిని అరెస్ట్ చేసే అవకాసం కూడా ఉంది అంటూ, సమాచారం వస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావటం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయం పై ఉదాసీనంగా ఉన్నారని, సిబిఐ కూడా ఇలా చేస్తే ఎలా అని, పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, సిబిఐ దూకుడు పెంచింది. ఈ సారి మూడో విడత విచారణలో, ఏదో ఒకటి తేలే దాకా కొనసాగే అవకాసం ఉందని, త్వరలోనే ఇది క్లైమాక్స్ కు వస్తుందని అంటున్నారు. ఘటన జరిగిన రోజు, ఎవరు ఉన్నారు, ఎవరు ర-క్తం మరకలు తుడిచారు, ఎవరు తుడవమంటే తుడిచారు, అప్పటికే చనిపోయిన వ్యక్తి తలకు కుట్లు ఎందుకు వేసారు ? ఎవరు వేసారు ? ఎవరు వేయమంటే వేసారు ? బయటకు గుండె నొప్పి అని ఎందుకు చెప్పారు ? ముందు ఎవరు చెప్పారు ? ఇలాంటి అనేక ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరికే అవకాసం ఉంది.