వైఎస్ వివేక కేసుకు సంబంధించి మరోసారి కడపలో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన సూత్రధారి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే అంటూ సిబిఐ సంచలన విషయాలు బయట పెట్టింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కోసం నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని కోర్టులో వేసిన పిటీషన్ లో, ఈ కీలక అంశాన్ని సిబిఐ బయట పెట్టింది. పులివెందుల కోర్టులో ఈ కేసు నేడు విచారణకు రానుంది. అలాగే రెండు రోజుల క్రిందట కడప జిల్లా కోర్టులో బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. వివేక కేసు జరిగిన రోజు మొత్తం దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నడిపించాడని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఆ రోజు గుండె నొప్పి అంటూ మీడియాకు చెప్పించింది కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని సిబిఐ తెల్చేసింది. రక్తపు వాంతులతో గుండె పోటు వచ్చి వివేక చనిపోయారని చెప్పించినట్టు సిబిఐ పేర్కొంది. అలాగే పులివెందుల సిఐని కూడా మోటివేట్ చేసే బాద్యత కూడా శివశంకర్ రెడ్డి తీసుకున్నాడని తేల్చింది. సిబిఐ విచారణ సమయంలో కూడా, అతను సహకరించటం లేదు కాబట్టి, అతనికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయాలని సిబిఐ భావించింది. ఆ రోజు ఏమి జరిగింది, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ఏమిటి అనే విషయాల పై, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ కోర్టుకు వివరించటం జరిగింది.

viveka 23122021 2

ఇతను కీలక వ్యక్తి కాబట్టి, దర్యాప్తులో సహకారం ఇవ్వటం లేదు కాబట్టి, నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోర్టుని కోరింది సిబిఐ. దేవిరెడ్డి శివసంకర్ రెడ్డి వెనుక ఎవరు ఉన్నారు ? ఆ సూత్రధారులు ఎవరు ? ఎవరు చేపించారు అనే విషయం తెలుసుకోవాలని సిబిఐ కోరింది. మొత్తం వివరాలు రాబాట్టాలి అంటే దేవిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సిబిఐ చెప్తుంది. కోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయో చూడాలి. మరో పక్క దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అనే విషయం తెలిసిందే. అయితే నిన్న కొన్ని మీడియా చానల్స్ లో, ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ విచారణకు పిలవటానికి సిద్ధం అయినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కేంద్ర హోం శాఖకు కూడా సమాచారం అందించారని, అందుకే విచారణ ఆపి ఢిల్లీకి వెళ్లి, మళ్ళీ తిరిగి వచ్చారనే ప్రచారం జరుగుతుంది. క్రిస్మస్ తరువాత, ఏ క్షణమైనా ఒక పెద్ద వ్యక్తిని సిబిఐ అరెస్ట్ చేయబోతుంది అంటూ, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read