ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేకెత్తించిన, జగన్ బాబాయ్ వివేక కేసులో ఉన్న నిందితులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు హైకోర్టు దీనికి సంబంధించి, కొద్ది సేపటి క్రితం ఒక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్ గా మారటాన్ని సవాల్ చేస్తూ, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గంగిరెడ్డి, ఉమాశంకర్‍రెడ్డి, పిటీషన్లు వేసారు. ఈ పిటీషన్ల పై హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. అటు సిబిఐ వైపు నుంచి, ఇటు నిందితుల వైపు నుంచి కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారటానికి వీలు లేదని, అతను జడ్జి ముందు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో, కుట్ర ఎలా చేసింది వివరించటంతో పాటు, తాను కూడా ఆ కుట్రలో ఉన్నానని చెప్పిన తరువాత, అతను అప్రూవర్ గా ఎలా మారతారని వాదనలు వినిపించారు. అయితే సిబిఐ మాత్రం, నిందితులు చేస్తున్న వాదనలు అన్నీ కూడా సిబిఐ కుట్టి పారేసింది. ప్రధానంగా వివేక కేసులో జరిగిన అంశాలు అన్నిటికీ సంబంధించి కూడా, న్యాయమూర్తి ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం తమకు ఉందని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. వీటితో పాటుగా దస్తగిరి విషయంలో కూడా సిబిఐ అనేక విషయాలు కోర్టుకు చెప్పింది.
దస్తగిరి ఈ కేసులో విషయాలు అన్నీ చెప్పాడని, ఎవరు ఈ కుట్రలో ఉన్నారు, పెద్దలు అండ గురించి, ఆయుధాల గురించి, ఇలా అనేక విషయాలు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉన్నాయని, అందువల్ల దస్తగిరి అప్రూవర్ గా మారిన తరువాతే, ఈ కేసులో పురోగతి ఉందని సిబిఐ వాదించింది. ఈ నేపధ్యంలోనే, రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో ప్రధానంగా, దస్తగిరి అప్రూవర్ గా మారటాన్ని సవాల్ చేస్తూ, గంగిరెడ్డి, ఉమాశంకర్‍రెడ్డి పిటీషన్లు వేసారో, ఆ పిటీషన్లు రెండూ కూడా, హైకోర్టు కొట్టేసింది. అదే విధంగా సిబిఐ ఏదైతే వాదనలు వినిపించిందో, ఆ వాదనలు అన్నీ కూడా హైకోర్ట్ సమర్ధించింది. సిబిఐకి అతన్ని అప్రూవర్ గా మార్చేందుకు స్వేఛ్చ ఉందని కూడా స్పష్టంగా ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి తీర్పు కాపీ ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాసం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివేక కేసు, ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఏకంగా సజ్జల నిన్న, సిబిఐని, చంద్రబాబు చెప్పినట్టు పని చేస్తున్నారు అని చెప్పటం, ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.