పరిటాల రవి హ-త్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీను అంటే తెలియని వారు ఉండరు. అయితే ఆ తరువాత మొద్దుశీను కూడా జైల్లోనే హ-త్య-కు గురైన విషయం తెలిసిందే . ఈ విషయం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. అప్పట్లో మొద్దుసీనుని జైల్లో పెట్టిన తరువాత తాను అప్రూవర్ మరతానని కోర్టుకు తెలియచేసిన తరువాత , ఈ పరిటాల రవి హ-త్య కేసులో మరో నిందితుడు అయిన ఓం ప్రకాష్ చేతిలో మొద్దుశీను దారుణంగా హ-త్య-కు గురి అయిన సంగతి తెలిసిందే. మొద్దుశీనుని, ఓం ప్రకాష్ సిమెంట్ డంబెల్తో కొట్టి చం-పా-డు. కాని మొద్దుశీను సెల్ లోకి ఓం ప్రకాష్ ఎలా వచ్చాడు, అతని సెల్లోకి సిమెంట్ డంబెల్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికి మిస్టరీనే. అయితే అప్పటి వరకు అనంతపురం జైలు సూపరింటెండెంట్ ఉన్న ఆయన మొద్దుశీను హ-త్య జరిగిన రోజున సెలవుల్లో ఉన్నారు. ఆయన ప్లేస్ లో ఇంచార్జ్‌గా పోచా వరుణారెడ్డి భాధ్యతలు తీసుకున్నారు. అయితే అసలు సూపరింటెడెంట్ సెలవు నుంచి విధుల్లోకి వచ్చే సరికి కధ మొత్తం జరిగి పోయింది. అసలు వరుణారెడ్డి ఓం ప్రకాష్ ను మొద్దుశీను సెల్ లోకి ఎందుకుపంపించ్చారని కూడా విమర్శలు ఎదుర్కున్నారు. అయితే మొద్దు శీను హ-త్య ఉదంతం అంత ఆయన కనుసన్నల్లోనే జరిగిందని ఆయనను అప్పట్లో సస్పెండ్ కూడా చేసారు.
అప్పట్లో ఈ అదికారి పై మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి కంప్లైంట్ చేస్తూ ఒక ఉత్తరం కూడా రాసారు. ఆతరువాత ఈయన కూడా హ-త్య కాబడ్డాడు. ఇదంతా అప్పుడు జరిగితే, తాజాగా ఇప్పుడు అదే అధికారి వరుణారెడ్డి, ఇప్పుడు మళ్ళీ కడప జైలు సూపరిండెంట్‌గా భాద్యతలు చేపట్టారు. అయితే ఏమాత్రం అర్హత లేని ఆయన్ను ఎలా సూపరిండెంట్‌గా నియమిస్తారని కూడా విమర్శలు వస్తున్నాయి. వైసిపి ప్రభుత్వంలో ఈ సస్పెండ్ అయన ఆయనకు, మెడల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ స్టొరీ అంతా ఎందుకు అంటే, కడప జైల్లోనే, వివేక కేసు నిందితులు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా దస్తగిరి, ఇప్పటికే అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతోనే, కూసాలు కదిలిపోయాయి. అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్ ని అరెస్ట్ చేసి లోపల వేసే వరుకు విషయం వెళ్ళింది. ఇప్పుడు ఈ అధికారి ఇక్కడకు రావటంతో, అందరూ మొద్దు శీను ఘటన, అలాగే ఇప్పుడు దస్తగిరి పరిస్థితి ఏమిటి అనే విషయం పై, రిలేట్ చేస్తూ కధనాలు రాస్తున్నారు.