జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేక కేసు మూడేళ్ళ నుంచి సాగుతూనే ఉంది. మూడు సిట్ లు వేసిన తరువాత, ఈ కేసు హైకోర్టు జోక్యంతో పోయిన ఏడాది సిబిఐ వద్దకు వెళ్ళింది. అయితే సిబిఐ విచారణలో కూడా పెద్దగా మార్పు ఏమి లేదు. ఏదో కనుగున్నట్టే ఉంటారు, వెంటనే స్లో అయిపోతారు. అలాగే అసలు పెద్ద తలకాయల వద్దకు , ఇప్పటి వరకు సిబిఐ వెళ్ళలేదు అనే అభిప్రాయం ఉంది. అనేక ట్విస్ట్ లు తిరుగుతున్న ఈ కేసులో, ఇప్పుడు తాజాగా రఘురామరాజు బయట పెట్టిన ఒక విషయంతో, మళ్ళీ కలకలం రేగింది.   అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్ అలాగే వైసీపీ నేత శివశంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేత శివశంకర్ రెడ్డిని ఎలాగైనా బయటకు తీసుకుని రావటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందు కోసం బెయిల్ పిటీషన్ కోసం వేసారు. అయితే అనూహ్యంగా ఈ బెయిల్ పిటీషన్ కోసం, ప్రభుత్వ లాయర్ చంద్ర ఓబుల్ రెడ్డి,  శివశంకర్ రెడ్డి తరుపున వాదనలు వినిపించారని, ఒక ప్రభుత్వ న్యాయవాది, పార్టీ నాయకుడి కేసులు ఎలా వాదిస్తారు అంటూ, రఘురామ రాజు లేవనెత్తటమే కాక, ఇదే విషయం పైన, చంద్ర ఓబుల్ రెడ్డిపై బార్ కౌన్సిల్ చైర్మన్ కు కూడా రఘురామరాజు ఫిర్యాదు చేయటంతో, ప్రభుత్వ పెద్దలు ఇలా ఎందుకు చేస్తున్నారు అనే అనుమానం కలుగుతుంది. ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read