జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేక కేసులో నిన్న అతి పెద్ద ట్విస్ట్ నెలకొంది. వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ తరువాత, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ముందు నుంచి అనుకున్నట్టు, ఇది సొంత కుటుంబ సభ్యులే విషయమే అని అర్ధం అయ్యింది. నిన్న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో అనేక కీలక అంశాలు బయట పడ్డాయి. అయితే ఈ కేసు మొత్తం ఎర్ర గంగి రెడ్డి చుట్టూ తిరిగేలా నిన్నటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. ఇన్ని సంచలనాలు ఇందులో ఉన్నా, చాలా విషయాల్లో మాత్రమే ఎక్కడా క్లారిటీ రావటం లేదు. బెంగుళూరు డీల్ విషయంలో, వివేకా కు ఎనిమిది కోట్లు వచ్చాయని, అందులో తనకు వాటా ఇవ్వలేదని ఎర్ర గంగి రెడ్డి వివేక మీద ఆగ్రహించి, వివేక మ-ర్డ-ర్ కు ప్లాన్ చేసారని దస్తగిరి చెప్పాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ మ్ద-ర్ద-ర్ కు రూ.40 కోట్ల సుపారీ అని గంగి రెడ్డి చెప్పినట్టు చెప్తున్నారు. ఇక్కడే ఎవరికీ అర్ధం కావటం లేదు. రూ.8 కోట్ల డీల్ విషయంలో తేడా వస్తే, రూ.40 కోట్ల సుపారీ ఎలా ఇస్తారు ? అనేది మొదటి ప్రశ్న. రెండో విషయం, అసలు ఎర్ర గంగిరెడ్డి సామాన్యుడు. అతని వద్ద రూ.40 కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి ? మూడో ప్రశ్న, ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ప్రొఫెషనల్ కిల్లర్స్ వస్తారు కానీ, మరీ ఇంత చిల్లరగా గొడ్డలి పట్టుకుని ఎందుకు వస్తారు ?

dastagiri 14112021 2

గొడవ జరిగింది, ఎర్ర గంగిరెడ్డి , వివేక మధ్య అయితే, అవినాష్ రెడ్డి,భాస్కర్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది ? ఇలా అనేక ప్రశ్నలు ఆ స్టేట్మెంట్ పైన వస్తున్నాయి. శంకర్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఇచ్చినట్టు చెప్తున్నాడు. ఈ శంకర్ రెడ్డి వైసీపీ స్టేట్ సెక్రటరీ,అవినాష్ రెడ్డి, జగన్ కు దగ్గరగా ఉంటాడు. మరి అతను ఎందుకు డబ్బులు ఇస్తాడు ? అతనికి రూ.40 కోట్లు ఎక్కడివి ? వీళ్ళందరూ పాత్రధారులు లాగే కనిపిస్తున్నారు, అసలు వాళ్ళు ఎవరు ? ఇక ఇది పక్కన పెడితే ఆ రోజు ఉదయం జరిగిన డ్రామా గురించి కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి గుండె నొప్పి అని ఎందుకు చెప్పారు ? జగన్ మామ గంగిరెడ్డి, కుట్లు ఎందుకు వేసారు ? అప్పటి పులివెందుల సిఐ ఎందుకు వదిలేసారు ? ఇలా అనేక అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మరి సిబిఐ ఏమి చేస్తుంది ? ఎందుకు మౌనంగా ఉంది ? కన్ఫెషన్ ఇచ్చిన తరువాత కూడా, ఎందుకు అవినాష్ రెడ్డి దాకా దర్యాప్తు వెళ్ళలేదు ? ఇలా ఎన్నో ప్రశ్నలు ఇంకా పజిల్ గానే ఉన్నాయి. మరి అసలు వాళ్ళు బయట పడతారా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read