జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేక కేసు, తెలినట్టే తేలుతుంది, మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్య కాలంలో, ఈ కేసు విషయం పై వస్తున్న వార్తలు చూస్తే, ఈ కేసు అయిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ మళ్ళీ చాడీ చప్పుడు ఉండదు. వివేక కుమార్తె సునీత హైకోర్టులో పిటీషన్ వేసి మరీ, ఏపి పోలీసుల పైన నమ్మకం లేదని, సిబిఐకి విచారణ బాధ్యతలు ఇవ్వమని కోరారు. తరువాత హైకోర్టు, ఈ కేసుని సిబిఐకి అప్ప చెప్పింది. తరువాత రకరాకాల కారణాలతో సిబిఐ విచారణ లేట్ అయ్యింది. ఆ తరువాత సునీత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, కేసు విచారణ పై అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత, ఈ కేసు మళ్ళీ స్పీడ్ అందుకుంది. ఈ మధ్య కాలంలో వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ తో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ మొత్తం స్కెచ్ వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారనే వార్తలు బయటకు రావటంతో, సంచలనంగా పరిణామాలు మారాయి. అయితే అవినాష్ రెడ్డి ముఖ్య అనుచురుడు దేవిరెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయటంతో, ఒక్కసారిగా వైసీపీలో కలకలం రేగింది. తరువాత రోజు నుంచి, సిబిఐ పైనే ఎదురు దా-డి మొదలు పెట్టారు. సిబిఐ డబ్బులు ఇచ్చింది చెప్పిస్తుందనే ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం అనూహ్యంగా బ్లూ మీడియా నుంచి వచ్చింది.
అక్కడితో ఆగలేదు, వివేక పైనే ఆరోపణలు చేసారు. అతనికి స్త్రీల బలహీనత ఉందని ప్రచారం మొదలు పెట్టారు. ఆ తరువాత వివేక అల్లుడు, కుమార్తె పైనే ఆరోపణలు చేసారు. ఈ నేపధ్యంలోనే, ఈ కేసుని తేలనివ్వకుండా, మరింత సాగ దీయటానికి , ఇప్పటికే కొన్ని అవినీతి కేసుల్లో మనం చూస్తున్న డిశ్చార్ పిటీషన్ల ప్లాన్, ఇక్కడ కూడా వేసారు. ఒకే రోజు రెండు పిటీషన్లు దాఖలు అవ్వటంతో, ఈ కేసుని వీలైనంత సాగ దీయాలి అనే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎర్ర గంగి రెడ్డి, ఈ కేసు నుంచి తనని తప్పించాలని హైకోర్టులో పిటీషన్ వేసారు. ఇప్పటికే ఇతను ఇదే కేసులో బెయిల్ పై బయట ఉన్నారు. ఇక రెండోది, దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ పిటీషన్ పైన. దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ పిటీషన్ ను అంగీకరించవద్దు అంటూ, ఇదే హైకోర్టులో మరో పిటీషన్ దాఖలు అయ్యింది. ఇక వీటి వాయిదాలు, అనేక అనేక విన్యాసులు పిటీషనర్లు చేస్తూ, కేసుని సాగదీసే అవకాసం ఉంది. ఇది కూడా ఇప్పటికే మనం చూస్తున్న అవినీతి కేసులు లాగా ఏళ్ల తరబడి సాగినా ఆశ్చర్యం లేదు.