జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేక కేసు, మొన్నా మధ్య స్పీడ్ అందుకుని, ఎందుకో కానీ సడన్ గా స్లో అయిపొయింది. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే కనీసం సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు కూడా పిలవలేదు. పరిస్థితి ఇంత వేగంగా ఎందుకు మారిందో, ఎందుకు విచారణ స్లో అయ్యిందో, ఆ దేవుడికే తెలియాలి. ఇది పక్కన పెడితే, ఇప్పుడు మరో సంచలన విషయం బయటకు వచ్చింది. వైఎస్ వివేక కేసులో, ప్రధాన సూత్రదారుడుగా సిబిఐ భావిస్తున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సిబిఐ అధికారులు గతంలోనే అరెస్ట్ చేసారు. అతనికి కోర్టు బెయిల్ కూడా ఇవ్వలేదు. దీంతో అతను జైల్లోనే ఉంటున్నాడు. ఈ దేవిరెడ్డి శంకర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డికి బాగా దగ్గర మనిషి, ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అయితే దేవిరెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి, వైసీపీలో వణుకు మొదలైంది. ఈ దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఎలాంటి వివరాలు బయటకు చెప్తాడో అని వణికిపోయారు. అయితే ఇప్పుడు ఏకంగా దేవిరెడ్డి శివశంకర్​రెడ్డిని, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కలవటం చర్చనీయంసం అయ్యింది. సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు అయిన, వివేకను చంపిన వారిని, వైసీపీ ఎమ్మెల్యేలు కలవటం పై వైసీపీ శ్రేణులు కూడా విస్మయం వ్యక్తం చేసాయి.

viveka 01042022 2

జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇద్దరు కలిసి ఒకేసారి దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కలిసారు. కడప జైల్లో రిమాండ్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్​ రెడ్డితో, ఈ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ములాకత్ అవ్వటంతో, పులివెందులలో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు ఉలిక్కి పడ్డాయి. దాదాపుగా అరగంట పైన, ఇద్దరు ఎమ్మెల్యేలు దేవిరెడ్డి శంకర్ రెడ్డిత కలిసి మాట్లాడారు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటుగా, దేవిరెడ్డి శంకర్ రెడ్డి భార్య కూడా వచ్చారు. ఒక పక్క వివేక కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్ది ప్రధాన నిందితుడు అని సిబిఐ చెప్తుంటే, వైసీపీ పార్టీ ఎమ్మల్యేలు వెళ్లి అతన్ని కలవటం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివేక జగన్ బాబాయ్ కాబట్టి, ఈ భేటీ జగన్ కు తెలియకుండా జరిగి ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే వివేకను చంపిన వారిని జగన్ వెనకేసుకుని వస్తున్నారని అనేక వార్తలు వచ్చాయి. సాక్ష్యాత్తు సునీత కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది, ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలే వెళ్లి కలిసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read