జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేక కేసు విషయంలో, సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ అధికారులు ఈ కేసు దర్య్పాటు చేస్తున్నారు. దాదాపుగా రెండేళ్లుగా ఈ కేసు దర్యాప్తు సిబిఐ చేస్తుంది. ఈ నేపధ్యంలోనే వారు కడపలో, ప్రభుత్వానికి చెందిన ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌస్ లో ఉంటూ, ఈ దర్యాప్తు చేస్తున్నారు. ఇందు కోసం, ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌస్ లో మూడు గదులను సిబిఐ అధికారులు అద్దెకు తీసుకున్నారు. అక్కడ నుంచే వివేక కేసు పై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ అధికారులకు షాక్ ఇచ్చింది. కడపలో సిబిఐ ఉంటున్న ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌస్ ఖాళీ చేయాలని ఆదేశిస్తూ, సిబిఐకి షాక్ ఇచ్చింది. వెంటనే గెస్ట్ హౌస్ లో సిబిఐ తీసుకున్న మూడు గదులను ఖాళీ చేయాలని ఆదేశాలు వెళ్ళాయి. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల కోసం జగన్ వస్తున్నారని, అందుకోసం ప్రముఖుల కోసం, ఇక్కడ ఏర్పాట్లు చేయాలని, గదులు అన్నీ మరమ్మతులు చేయాలని, అందుకే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మరి దీని పై సిబిఐ ఎలా రియాక్ట్ ఆవ్తుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఎంపీని సిబిఐ విచారణకు పిలవలేదు. ఎదురు మళ్ళీ, ఇలా అవమానాలు పడుతున్నారు. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి మరి.
వివేక కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులకు షాక్ ఇచ్చిన ఏపి ప్రభుత్వం..
Advertisements