మాజీ మంత్రి, జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ అయిన, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సిబిఐ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఏడవ రోజు పులివెందులలోని వివేక ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. మొదటగా వాచ్మె న్ రంగయ్యను సీబీఐ అధికారులు విచారించారు. అతన్ని అందుబాటులోనే ఉండాలని కోరారు. పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం కేసు పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాల పై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. కీలక వ్యక్తులు, అనుమానితులు సిట్ విచారణలో చెప్పిన సమాధానాలపై నిశితంగా పరిశీలిస్తున్నారు. సిట్ వేసిన ప్రశ్నలు, వచ్చిన సమాధానాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. కేసుపై పూర్తిస్థాయిలో స్టడీ చేశాకే కీలక వ్యక్తులు, అనుమాని తులను విచారించే అవకాశముంది. పలుమార్లు షిట్ బృందాన్ని విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా పలుసార్లు వివేకా ఇంటిని పరిశీలించారు. స్కెచ్ రూపంలో వివేకా ఇంటి నమూనాలను సేకరించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత విచారణలో లేవనెత్తిన అంశాలపై లోతైన అధ్యయనం చేస్తున్నారు.
గోప్యంగా విచారించేందుకు మకాం మార్చడం జరిగింది. వివేకా మృతికి గల కారణా లను సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. వివేకానందరెడి హత్య కేసులో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు ఆదేశాలతో పులివెందులలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టడం తెలిసిన విషయమే. విచారణ చేపట్టిన మొదటి రోజు, రెండవరోజు జిల్లా ఎస్పీతో వివేకా హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. హత్య కేసుపై అనుమానితుల విచారణ మకాం మార్చిన సన్నివే శాన్ని బట్టి చూస్తే లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో, వైఎస్ సునితా రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్న, వైఎస్ కుటుంబ సన్నిహితులను, ఈ రోజో రేపో, ప్రశ్నించే అవకాసం ఉందని తెలుస్తుంది. మొదటగా 7 గురు బృందంతో వచ్చిన సిబిఐ, ఈ రోజు దాదాపుగా మొత్తం 30 మంది వివిధ సిబ్బంది, ఈ రోజు వివేక ఇంట్లో, కొన్ని కీలక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.