బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌-త్య కేసు విచార‌ణ‌కి అబ్బాయి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హ‌క‌రిస్తే, ఈ కేసు మిస్ట‌రీ వీడిపోతుంద‌ని వివేకా హ-త్య కేసులో అప్రూవర్‍ గా మారిన‌ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇంత‌వ‌ర‌కూ త‌న బాబాయ్ హ‌-త్య‌కేసులో విచార‌ణ ముందుకు సాగ‌డానికి అబ్బాయి స‌హ‌క‌రించ‌డంలేద‌ని స్ప‌ష్టం అవుతోంది. మొద‌ట్లో గుండెపోటు అని, ఆ త‌రువాత గొడ్డ‌లిపోటు అని, అదీ నారాసురర‌క్త చ‌రిత్ర అని ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ క్యాంప్. సీబీఐ ఎంక్వైరీ కోర‌డం, ఆ త‌రువాత వారే వ‌ద్ద‌న‌డం, ద‌ర్యాప్తున‌కు వ‌చ్చిన సీబీఐపై దా-డు-లు..నిందితులు, అనుమానితుల్ని వైఎస్ జ‌గ‌న్ వెన‌కేసుకు రావ‌డ‌మే కాదు వారిని కాపాడుతుండ‌డంతో అనుమానాలు తీవ్రం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సీబీఐ ఏకంగా తాడేప‌ల్లి ప్యాలెస్లో సీఎం జ‌గ‌న్, ఆయ‌న భార్య భార‌తి ఫోన్ కాల్స్ గురించి సీబీఐ ఆరా తీసిన నేప‌థ్యంలో  వివేకా హ-త్య కేసులో త్వరలో నిజానిజాలు తేలే రోజు ద‌గ్గర పడింద‌ని ద‌స్త‌గిరి చెప్పుకొచ్చాడు. ఇంతకాలం నేను చెప్పింది అబద్ధాలంటూ కొందరు మాట్లాడార‌ని, ఇటీవల కొందరిని సీబీఐ విచారించిందంటే, వారికి సమాచారం ఉండ‌కుండా చేయ‌రు క‌దా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు.  ఏపీలో విచారణకు జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లోనే వివేకా హ-త్య కేసు పూర్తయ్యేదని మ‌రో పెద్ద బాంబు పేల్చాడు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read