ఎన్నికల ముందు, జరిగిన జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, రాష్ట్రంలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసిందే. అప్పట్లో జగన్ కూడా ఆయన బాబాయ్ హత్య పై సిబిఐ విచారణ జరపాలని ఆందోళన కూడా చేసారు. వివేక కూతురు కూడా, తన తండ్రిని చంపిన వారు ఎవరో తెలియాలి అంటూ ఆందోళన చేసారు. అయితే జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయన తలుచుకుంటే, నిమిషాల మీద సిబిఐ ఎంక్వయిరీ కోరవచ్చు. ఎందుకో కాని జగన్ ఆ విషయం మర్చిపోయారు. వివేక కూతురు కూడా, ఈ విషయం పై ఎక్కడా స్పందించలేదు. అయితే పోలీస్ విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో, నిన్న అర్ధరాత్రి ఒక సంచలన వార్తా బయటకు వచ్చింది. వివేకా హత్యకేసులో, ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి రాత్ర ఆత్మహత్య చేసుకున్నాడు.
సింహాద్రిపురం మండలం కసునూరులో నిద్రమాత్రలు మింగిన శ్రీనివాసులరెడ్డి, కడప ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. శ్రీనివాసులరెడ్డి వైఎస్ వివేక కేసులో ఒక నిందితుడుగా ఉన్నారు. ఆయన పోలీసులు పెట్టే వేధింపుల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాసులరెడ్డి సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. వివేకా హత్య సుతో తనకు సంబంధం లేదని, అయినా తనను టార్చర్ పెడుతున్నారని లేఖలో పెర్కున్నారు. శ్రీనివాసులరెడ్డి రెండు సూసైడ్ నోట్ లు రాసారు. ఒకటి సీఎం జగన్, వైఎస్ భాస్కర్‌రెడ్డికి శ్రీనివాసులరెడ్డి వేరు వేరుగా లేఖ రాశాడు. సూసైడ్ నోట్‌ను గమనించిన డాక్టర్లు, వాటిని కుటుంబ సభ్యులకు అందచేసారు. సీఐ రాములు, శ్రీనివాసులరెడ్డిని తీవ్రంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యపై ఆయన కుమారుడు స్పందిస్తూ. ‘‘రెండ్రోజుల క్రితం పోలీసులు విచారణకు పిలిచారు. వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధం లేకపోయినా విచారణ ఎదుర్కోవడంతో అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్ కుటుంబం అంటే మా నాన్నకు చాలా అభిమానం’’ అని శ్రీనివాసులు రెడ్డి కుమారుడు పేర్కొన్నాడు. తన బావ అయిన శ్రీనివాసులరెడ్డిని, గత నెల రోజులుగా పోలీసులు వేధిస్తున్నారని, ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న మరో నిందితుడు పరమేశ్వర్‌రెడ్డి వాపోయాడు. వైఎస్ కుటుంబానికి 30 ఏళ్లుగా మేము సేవ చేస్తున్నామని, ఈ కేసుతో మాకు సంబంధం లేకపోయినా, నార్కో పరీక్షల కోసం తనను గుజరాత్ తీసుకెళ్లారని కన్నీటి ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ఈ ఆత్మహత్య పై పలు అనుమానాలు కూడా ఉన్నాయని, అవి పోలీసులు విచారణలో బయట పెట్టాలని, పలువురు వాపోతున్నారు.