జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఇంకా మిస్టరీగానే ఉన్న సమయంలో, ఈ రోజు ఈ కేసు కీలక మలుపు తిరిగింది. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆధారంగా భావిస్తున్న వాచ్‌మెన్‌ రంగయ్యకు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపధ్యంలో, హైదరబాద్ లో అనాలిసిస్ పరీక్షలు చెయ్యనున్నారు. దీని కోసం వాచ్‌మెన్‌ రంగయ్యను ఇప్పటికే హైదరాబాద్ తరలించారు. వైఎస్ వివేక కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో, వాచ్‌మెన్‌ రంగయ్యను రెండు రోజులగా సిట్ అధికారులు విచారణ చేసారు. విచారణ సందర్భంలో వాచ్‌మెన్‌ రంగయ్య సరైన సమాధానం చెప్పకపోవడంతో, అనుమానం వచ్చిన అధికారులు నార్కో పరీక్షలకు కోర్ట్ ని కోరారు. దీంతో కోర్ట్ నార్కో అనాలిసిస్ పరీక్షలకు అనుమతి ఇచ్చండి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, జగన్ బాబాయ్ అయిన వివేక, ఎన్నికలకు ముందు హత్యకు గురయ్యారు. ముందుగా హార్ట్ అటాక్ అని చెప్పిన బంధువులు, తరువాత హత్య అని చెప్పారు. సొంత ఇంట్లోని బాత్ రూమ్ లో, వివేకానందరెడ్డిని దుండగులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపారు. వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్‌ సునీత హైదరాబాద్‌లో ఉన్న సమయంలో, వైఎస్ వివేకా ఒక్కరే పులివెందులలోని సొంత ఇంట్లో ఉంటున్నారు. వివేక ఒక్కరే ఉన్న సమయంలో, ఆయనను బాత్రూంలో దారుణంగా హత్య చేశారు. నుదుటిపైన, తల వెనుక, రెండువైపులా నాలుగు చోట్ల గొడ్డలితో బలంగా దాడి చేసిన గాయాలు ఉన్నాయి. అలాగే, కుడి చేయి, కుడి తొడ, ముక్కు దగ్గర బలమైన గాట్లు ఉన్నాయి. మొత్తం 7 చోట్ల గొడ్డలితో నరికినట్టు, పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఎన్నికల ప్రచారంలో కూడా ఈ హత్య సంచాలనం సృష్టించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read