వైఎస్ వివేకా కేసు, సిబిఐ వేగంగా విచారణ చేస్తుంది. ఇప్పటికే వివేక కేసులో పాత్రధారులు అయిన ఎర్ర గంగిరెడ్డి , సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిలను సిబిఐ గుర్తించింది. ఇందులో దస్తగిరి నిజం కూడా ఒప్పేసుకున్నారు. ఇప్పుడు సిబిఐ సూత్రధారులు పై దృష్టి పెట్టింది. సుత్రధారులు పెద్ద తలకాయలు కావటంతో, వారిని పక్కాగా, పూర్తి ఆధారాలతోనే పట్టుకోవాలని సిబిఐ భావిస్తుంది. అన్ని రకమైన సాంకేతిక ఆధారాలను సిబిఐ రెడీ చేస్తుంది. ఏ నిమిషాన అయిన సూత్రధారులు అరెస్ట్ అవ్వొచ్చు అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా సిబిఐ విచారణ చేస్తుంది, రూ.40 కోట్ల డబ్బుల మూలాలు గురించి. దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో, వివేక ను వేసేయటానికి, 40 కోట్ల సుపారీ సెట్ అయినట్టు చెప్పాడు. అందులో తనకు 5 కోట్లు ఇస్తామని చెప్పారని, అడ్వాన్స్ గా కోటి రూపాయలు కూడా ఇచ్చారని దస్తగిరి చెప్పాడు. సునీల్ యాదవ్ తనకు కోటి రూపాయలు తీసుకుని వచ్చినట్టు దస్తగిరి చెప్పాడు. ఇప్పటికే ఆ కోటి రూపాయల్ని సిబిఐ సీజ్ చేసింది. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో, ఎర్ర గంగి రెడ్డి తనకు, డబ్బులు ఇస్తుంది, దేవిరెడ్డి శంకర్ రెడ్డి అని చెప్పాడని, మన వెనుక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఉన్నాడని భయపడ వద్దు అని చెప్పారని చెప్పాడు.

cbi 07032022 2

దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సిబిఐ, మిగతా వారికి ఎవరికైనా అడ్వాన్స్ లు వెళ్ళాయా ? ఇంకా ఎవరికి డబ్బులు ఇచ్చారు అనే విషయం పై ఆరా తీస్తుంది. అలాగే 40 కోట్లు అంటే సామాన్య విషయం కాదు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి లాంటి సామాన్యుల వల్ల ఇది కాదు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి వెనుక ఉన్న వారు ఎవరు, ఈ డీల్ ఎవరు కుదిర్చారు, 40 కోట్ల సంగతి ఏమిటి అనే విషయం పైన సిబిఐ ఇప్పటికే విచారణలో అనేక విషయాలు కనుగున్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా పది రోజుల క్రితం దస్తగిరిని మరోసారి సిబిఐ తీసుకుని,మరోకన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంది. ఆ స్టేట్మెంట్ లోనే, అనేక కీలక విషయాలు ఉన్నాయని, అవి పట్టుకునే సిబిఐ విచారణ చేసి, మూలాలు కనుగున్నట్టు ప్రచారం జరుగుతుంది. 40 కోట్లు ఎవరు ఇచ్చారో తెలిస్తే, ఈ కేసు దాదాపుగా పూర్తి అయిపోతుందని సిబిఐ భావిస్తుంది. అయితే పులివెందుల టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ నిమిషాన ఏమి జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read