వివేక కేసులో పెద్ద డెవలప్మెంట్ చోటు చేసుకుంది. నిన్న రాత్రి వివేక కేసు విచారణాదికారి సుధా సింగ్ ను బదిలీ చేసింది సిబిఐ. అయితే ఇప్పుడు మరో సంచలన విషయం బయట పడింది. ఈ కేసులో ఎన్నాళ్లుగానో, ఒక్క చోటే కేసు ఆగిపోయింది. బాత్రూమ్ లో చనిపోయారు, హార్ట్ అటాక్ అని చెప్పటం, తరువాత అసలు నిజం బయటకు రావటం తెలిసిందే. అంతే, ఇంతకు మించి ఒక్క అడుగు కూడా ఈ కేసులో ముందుకు పడలేదు. అయితే ఈ రోజు టీవీ చానల్స్ లో , ఈ కేసులో కీలక పురోగతి గురించి బ్రేకింగ్ న్యూస్ లో వస్తున్నాయి. ఈ కేసు పై అమితంగా ఆసక్తి ఉన్న ప్రజలు, ఈ పరిణామాన్ని గమనిస్తున్నారు. గత 44 రోజులుగా సిబిఐ చేస్తున్న విచారణలో పురోగతి కనిపించింది. ముఖ్యంగా వివేక వాచ్ మన్ రంగయ్య , జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట మొత్తం విషయం చెప్పెసినట్టు వ్వార్తలు వస్తున్నాయి. అయితే పేర్లు బయటకు చెప్పటం లేదు కానీ, జరిగిన తీరు మాత్రం, ఆ వాంగ్మూలంలో ఏమి చెప్పింది బయటకు వచ్చింది. వివేక హ-త్య కోసం మొత్తం రూ.8 కోట్లకు డీల్ మాట్లాడుకున్నారని వాంగ్మూలంలో చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయం వాచ్ మన్ రంగయ్య స్వయంగా జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు చెప్పారని ఆ వార్త సారంశం. అలాగే ఈ డీల్ లో మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్టు చెప్పాడు.
మొత్తం ఇద్దరు ప్రముఖులు ఈ వ్యవహారం నడిపించారని కూడా జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు చెప్పాడు. అయితే ఆ ఇద్దరు ఎవరూ అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఆ పేర్లు కడు జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. వివేక పోయిన రోజున, ఆయన ఇంట్లోకి మొత్తం అయుదుగురు కొత్త వాళ్ళు వచ్చారని ఆయన చెప్పారు. అయితే వాళ్ళు తనని కూడా చం-ప బోయరాని, అందులో ఒక వ్యక్తి వదిలేయమనటంతో తనని వదిలేసారని చెప్పాడు. అయితే సిబిఐ ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పులివెందుల మెజిస్ట్రేట్ ముందు కాకుండా, జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇప్పించింది. ఇది కూడా ఎవరికీ తెలియకుండా, సైలెంట్ గా పని కానిచ్చేసింది. అయితే ఇప్పుడు సుపారీ ఇచ్చింది ఎవరు ? ఎందుకు ఈ హ-త్య చేపించారు అనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. మరీ ముఖ్యంగా ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే నిన్న సాయంత్రం, సిబిఐ ఆఫీసర్ సుధా సింగ్ ను ఉన్నట్టు ఉండి బదిలీ చేసి, కొత్త ఆఫీసర్ ని రప్పించటం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.