విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ జ్ఞానాపురంలో ప్రజలు రోడ్డు ఎక్కారు. ప్రభుత్వం ఏదైతే ఎయిడెడ్ పాఠశాలలను, కాలేజీలను మూసివేస్తాం అంటూ రెండు నెలల క్రితం ఒక జీవో విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక ఎయిడెడ్ పాఠశాలలను, కాలేజీలలు వరుసగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల క్రితం, విజయవాడలో ఇలాగే మంటిసోరీ స్కూల్ ని కూడా ఇలాగే మూసివేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఎయిడెడ్ అనేది ఉండదని, అయితే ప్రైవేటు అయినా ఉండాలి, లేకపోతే ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సామాన్యంగా ఎయిడెడ్ పాఠశాలలను, కాలేజీలలో ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు జాయిన్ అవుతారు. ప్రభుత్వం ఈ సంస్థలకు ఎయిడ్ ఇస్తూ వస్తూ ఉండటంతో, ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. మంచి విద్య కూడా అందుతుంది. అందుకే ఎక్కువగా మధ్య తరగతి ప్రజలు ఇక్కడ జాయిన్ అవుతారు. ఇదే నేపధ్యంలో విశాఖలోని జ్ఞానాపురంలో సెయింట్ ఆన్స్, సెయింట్ జోసఫ్‍తో పాటు పలు ఎయిడెడ్ పాఠశాలలను ఇక మేము నడపలేం అని, ప్రభుత్వ నిర్ణయంతో, ఇక నడిపే అవకాసం లేదని, అందుకే మూసి వేస్తున్నాం అంటూ, ఆయా యాజమాన్యాలు ప్రకటించాయి.
దీంతో ఒకేసారిగా ఆ సంస్థల్లో చదువుకునే పిల్లలు, తల్లిదండ్రులు ఒకేసారి రోడ్డు ఎక్కారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఇక మేము స్కూల్ నడపలేం అని చెప్పారని, వేరే స్కూల్ లో జాయిన్ చేసుకోమని చెప్పారు అంటూ, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎక్కడకి వెళ్ళాలని వాపోయారు. మాకు అమ్మఒడి, యూనిఫారం కాదని, ఇలాంటి స్కూల్స్ తమకు కావాలని, వీటిని మూసివేయవద్దు అంటూ, రోడ్డు మీద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అయితే ఇదే సందర్భంలో అక్కడకు ఎమ్మెల్యే రావటంతో, ఒకేసారి ఆయన్ను చుట్టుముట్టారు. ఎమ్మెల్యేలను అడ్డుకుని సమస్య పరిష్కారం చేయాలని కోరటంతో, ఆ ఎమ్మెల్యే ఏమి చేయలేక ఆటలో పారిపోయే ప్రయత్నం చేసారు. అయితే ఆయన్ను అడ్డుకుని, తమకు న్యాయం చేయాల్సిందే అని కోరారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావటం, జగన్ మోహన్ రెడ్డికి ఎదురు చెప్పే ధైర్యం లేకపోవటం, ఆ ఎమ్మెల్యేకు అక్కడ నుంచి వెళ్ళిపోవటం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే చెప్పాలి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.