విశాఖను మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఏర్పాటయిన మెడ్‌టెక్ జోన్‌ను గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైద్య పరికరాల తయారీ పార్క్‌కు సాగర తీరం కేంద్రం కావడం విశేషం. పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. మెడికల్ డిస్పోజబుల్స్‌, వైద్య రంగంలో వినియోగించే యంత్ర పరికరాలు, సర్జికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మెడికల్ ఇంప్లాంట్స్‌, వ్యాధి నిర్ధారణతో పాటు ఆస్పత్రులలో వినియోగించే అన్ని రకాల పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. ఇలా అన్నీ ఒకేచోట ఉండటం ఈ పార్కు ప్రత్యేకత.

sehawag 22012019 1

అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన మెడ్‌టెక్‌ జోన్‌ కు ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో, మెడ్‌టెక్‌ జోన్‌ గురించి పుబ్లిసిటీ ఇచ్చింది. ఇదే విషయం పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేసారు.వైజాగ్ AMTZ, ప్రైడ్ అఫ్ ఇండియా అంటూ, ప్రశంసిస్తూ సెహ్వాగ్ ట్వీట్ చేసారు. ఇది సెహ్వాగ్ ట్వీట్.. "Wow ! @AP_MedTechZone shines at the World Economic Forum 2019 as a wonderful example of Sector Specific Innovation Cluster of global excellence. AMTZ is truly going to be a huge pride for India". వైద్యరంగానికి చెందిన అన్ని రకాల ఉపకరణాల తయారీకి ప్రత్యేకించిన ‘మెడ్‌టెక్‌ జోన్‌’, మొట్టమొదటి సారిగా మన రాష్ట్రంలో ఏర్పాటైతే, మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా, మన రాష్ట్రం కాకపోయినా, అక్కడ ఏర్పాటైన కంపనీలు గురించి, అందరికీ తెలిసేలా ట్వీట్ చేసిన సెహ్వాగ్ కు అందరూ కృతజ్ఞతలు చెప్పాలి.

sehawag 22012019 1

విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ మండలం మదీనాబాగ్‌ ప్రాంతంలో 270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ మెడ్‌టెక్‌ జోన్‌లో ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 80 కంపెనీలు ప్రారంభం అయ్యాయి. ఈ జోన్‌లో మొత్తం 250 కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అవన్నీ ఏర్పాటైతే మొత్తం 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అంచనా. భారత్‌ ఏటా రూ.30 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని... ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే లక్ష్యంతో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేసారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, విశాఖలో ఫర్మా సిటీ పెట్టి, అనేక కంపనీలను తీసుకొచ్చారు. ఇప్పుడు మెడ్ టెక్ జోన్ తో, అనేక వైద్య పరికరాల తయారీ కంపెనీలు రానున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read