జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, విజయసాయి రెడ్డి ఫోకస్ అంతా విశాఖపట్నం మీదే ఉంది. విశాఖని రాజధానిగా చెయ్యాలని నిర్ణయం తీసుకోవటం, కీలకమైన విశాఖ విజయసాయికి అప్పచెప్పటం, విశాఖలో జరిగే ప్రతి విషయం విజయసాయికి చెప్పే చేయాలనే ఆదేశాలు, ప్రతి ప్రజాప్రతినిధి కూడా విజయసాయికి చెప్పి పనులు చేయటం, ఇక్కడ జరుగుతుందా అంతా అందరికీ తెలిసిందే. విజయసాయి రెడ్డి అంత పవర్ఫుల్ గా అయ్యారు. విజయసాయి రెడ్డికి ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయలేరు. ఎంత ఇబ్బంది ఉన్నా, మౌనంగా భరించాల్సిందే కానీ, ఆయనకు ఎదురు చెప్పటం కానీ, విజయసాయి రెడ్డి పై పైన ఎవరికైనా ఫిర్యాదు చేయటానికి లేదు. అలాంటి పవర్ఫుల్ విజయసాయి రెడ్డి పై, వైసిపీలో మొదటి సారిగా బాహిరంగంగా విమర్శలు వచ్చాయి. ఆయన ముందే ధిక్కార స్వరం వినిపించారు. నిన్న విశాఖలో డీడీఆర్‌సీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంసం అయ్యాయి. మేమేమీ అవినీతిపరులం కాదు, నిజాయతీ పరులమే అంటూ అందరి ముందు విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. విశాఖలో ఒక మాజీ సైనికుడికి చెందిన భుముని ఎమ్మెల్యే ధర్మశ్రీతో పాటుగా కొంత మంది కొనుగోలు చేసారు. అయితే, దీనికి సంబంధించి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అయితే ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగి, చివరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాలేదు. దీని పై చర్చ జరుగుతూ ఉండగానే, నిన్న సమావేశంలో విజయసాయి రెడ్డి , ఇన్ డైరెక్ట్ గా ఈ విషయం పై స్పందిస్తూ, విశాఖలో జరుగుతున్న ఆక్రమణల వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు అంటూ తన ప్రసంగం మొత్తం రాజకీయ నాయకులు అంటూ, అనేక సార్లు కార్నర్ చేసే ప్రయత్నం చేసారు.

vsreddy 11112020 2

అయితే ఈ సమావేశంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ధర్మశ్రీ ఘాటుగా విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మాటిమాటికి రాజకీయ నాయకులు అంటున్నారు, మేము నిజాయితీ పరులమే, ప్రజల కోసం సేవ చేస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేసారు. అంతా రూల్స్ ప్రకారమే మేము ఆ భూములు కొనుగోలు చేసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడిగామని, అది రూల్స్ కు విరుద్ధం అయితే, దాన్ని ఇవ్వకండి, అంతే తప్ప మేమేదో చేసామని నిందించటం సరికాదు అని అన్నారు. భూములు దోచేసే దొంగలు ఉంటే వారి పై చర్యలు తీసుకోండి కానీ, అందరినీ దొంగలు అనటం సరి కదాని అన్నారు. మేము ఏ పని చెప్పినా అధికారులు సహకరించటం లేదని, ఏమి జరుగుతుందో అని వ్యాఖ్యానించారు. ఇక మరో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌ నాడు-నేడులో అవినీతి తారా స్థాయిలో ఉందని చెప్పటం, మరో విశేషం. ఇక విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఈ మీటింగ్ కి రాకపోవటం కూడా చర్చనీయంసం అయ్యింది. సింహాచలం దేవస్థానం భూముల కమిటీలో ఎంపీ పేరు లేకపోవటం వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారనే ప్రచారంలో, ఇప్పుడు ఎంపీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. మొత్తానికి విశాఖ వైసీపీలో , విజయసాయి రెడ్డి పై ఉన్న కోపం, ఇలా బయట పడింది ఏమో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read