ఆదివారం విశాఖలో ఒక్కసారిగా ప్రజలకు ఉలిక్కి పడ్డారు. విశాఖలో పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు చెప్పారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసారు. సుమారుగా 7.14 నిమిషాలకు భూమి కంపించింది. భూప్రకంపనలతో పాటుగా, భారీ శబ్దం కూడా వినిపించటంతో, భాయందోళనకు గురయ్యారు. అక్కయ్యపాలెం, మధురానగర్,  తాటిచెట్లపాలెం, సీతమ్మధార, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత 3.6 గా నమోదు అయ్యిందని, అధికారులు చెప్తున్నారు. గాజువాక సమీపంలో ఇది కేంద్రీకృతం అయ్యిందని తెలుస్తుంది. గతంలో ఏడు రోజులు క్రితం కూడా విశాఖలో ప్రకంపనలు వచ్చాయని, కానీ సిటీకి వెలుపల రావటం వల్ల, అది రికార్డుల్లో రాలేదని చెప్తున్నారు. అయితే ప్రకంపనలతో పాటుగా, పెద్ద శబ్దం కూడా రావటంతో, ఒక్కసారిగా విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు. అధికారులు మాత్రం ఎలాంటి భయం లేదని చెప్తున్నా, వరుసగా వస్తున్న ఈ ప్రకంపనల పై అయితే, ప్రజల్లో ఆందోళన ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read