ఈ రోజు ఉదయం, అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, తెచ్చిన రెండు బిల్లులు పై విచారణ జరిగింది. ఈ విచారణలో, హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, స్టేటస్ కో ని, వచ్చే నెల 21 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇదే సమయంలో, ఢిల్లీకి చెందిన సీనియర్ న్యాయవాది నితేష్ గుప్త, విశాఖపట్నంలోని కాపులుప్పాడ కొండపై 30 ఎకరాల్లో ప్రభుత్వం ఒక పెద్ద గెస్ట్ హౌస్ పేరిట నిర్మాణాలు చేస్తుందని, దీన్ని కోర్టు ధిక్కరణ కింద తీసుకోవాలి అంటూ, హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం, దీని పై ఎందుకు మీరు భూమి పూజ చేసారు అంటూ దీని పై వివరణ ఇవ్వాలి అంటూ, రాష్ట్ర చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇది జరిగిన మూడు గంటల్లోనే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ దిశగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు, ఇప్పుడు విడుదల చేసిన జీవో ద్వారా స్పష్టం అవుతుంది. కాపులుప్పాడ కొండపై హైకోర్టులో విచారణ జరిగిన మూడు గంటల వ్యవధిలోనే, విశాఖలోని కాపులుప్పాడ కొండపై గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం, 30 ఎకరాలను, విశాఖ కలెక్టర్ వెంటనే బదలాయించాలని చెప్తూ, ఏపి ప్రభుత్వంలోనే సాధారణ పరిపాలన విభాగ శాఖ ఆదేశాలు జరీ చేస్తూ, జీవో నెంబర్ 1353ను జారీ చేసింది.

vizag 27082020 2

ఈ జీవో ప్రకారం, విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం మండలంలో ఉన్న కాపులుప్పాడ ప్రాంతంలో, గ్రేహౌండ్స్ కోసం కేటాయించిన 300 ఎకరాల్లోని, 30 ఎకరాలను స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కేటాయించాలని, ఆ జీవోలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఈ అంశాన్ని అత్యవసరంగా తీసుకోవాలని, ఆ జీవోలో ఆదేశాలు ఇచ్చారు. ఇట్ మే బీ ట్రీటెడ్ యాజ్ అర్గేంట్ అంటూ, ఆదేశాల్లో తెలిపారు. దీనికి సంబంధించి, ఈ బదలాయింపు త్వరతిగతన జరగాలి అంటూ, జిల్లా కల్లెకర్ కు ఆదేశాలు జరీ చేసారు. ఈ జీవోని సాధారణ పరిపాలనాశాఖప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ విడుదల చేసారు. అయితే ఈ పరిణామం పై విశ్లేషకులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉదయమే దీని పై హైకోర్టులో కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద, హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళటం, దీని పై హైకోర్టు కూడా, అఫిడవిట్ దాఖలు చెయ్యండి అంటూ, ఏకంగా చీఫ్ సెక్రటరీని ఆదేశించటంతో, ఏమి జరుగుతుందా అని అందరూ అనుకున్న సమయంలో, ఏకంగా అధికారికంగా ప్రభుత్వమే జీవో రూపంలో రావటంతో, ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందా అనే చర్చ మొదలైంది. ఏది ఏమైనా కోర్టుల్లో కేసులు ఉన్నా, ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నదే చెయ్యాలని, ఎదో ఒక రూపంలో ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read