ఏపీలో మరోసారి భారీగా తనిఖీలు చేసేందుకు ఐటీ శాఖ సన్నద్ధమైందనే వార్తలు నిన్నటి నుంచి హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ టార్గెట్ గా ఐటి అధికారులు రంగంలోకి దిగారు. విశాఖలో ఇప్పటికే తనిఖీలు ప్రారంభంకాగా, విజయవాడ, గుంటూరు, నెల్లూరులోనూ సోదాలు చేసేందుకు ఐటీ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. విశాఖలోని ఎంవీపీ కాలనీలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి సుమారు 50 వాహనాల్లో అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాలకు తనిఖీల నిమిత్తం బయలుదేరి వెళ్లారు. దువ్వాడ సెజ్‌లోని పలు గోదాముల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు లాజిస్టిక్‌ రంగంలో భారీ కంపెనీగా ఉన్న టీజీఐలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సంస్థ తెలంగాణ తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ బంధువులకు చెందినదిగా తెలుస్తోంది.

it 241020018 2

మరో పక్క ట్రాన్స్‌వరల్డ్‌ బీచ్‌ శాండ్‌ కంపెనీలో సోదాలు జరుపుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలోనే వేచి ఉన్న మరికొన్ని బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసేందుకు కాసేపట్లో బయలుదేరనున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో కొందరు పన్ను సరిగా చెల్లించడం లేదన్న అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ శాఖాధికారులు దాడులు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఐటీ దాడుల ప్రచారం వివిధ రాజకీయ పక్షాల్లో కీలకంగా ఉన్నవారిలోనూ అలజడి రేపుతోంది.

it 241020018 3

మరో పక్క ఐటి దాడులకి వస్తున్న అధికారులు, ఏపిలో ముందుగానే ఎలా తెలుస్తుందో అని ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ దాడులకు వెళ్లినా విషయాన్ని రహస్యంగా ఉంచే అధికారులు, ఏపికి వచ్చినప్పుడు మాత్రం ముందే బయటపడిపోయారు. ఐటీ అధికారులు బస చేసేందుకు హోటల్స్ లో ముందే గదులు బుక్ కాగా, వాటిలోకి అధికారులు వెళుతున్న వేళ, హోటళ్ల సిబ్బంది గుర్తింపు కార్డులు చూపాలని కోరడంతోనే వాళ్లు ఐటీ అధికారులన్న విషయం బయటకు వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు వచ్చి మకాం వేశారన్న వార్త పలు హోటళ్ల సిబ్బంది నుంచే బయటకు పొక్కినట్టు తెలుస్తోంది. మరో పక్క పెద్ద ఎత్తున ఇలా రావటం కూడా, స్టేట్ ఇంటలిజెన్స్ పసిగట్టేస్తుందని, అతి తక్కువ మంది వస్తే ఎవరికీ తెలియదని, కాని పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, ఇలా వందల మంది వెళ్ళాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read