నిన్న ఏపిలో సూపర్ సండేలా ఉంది. ఒక పక్క అమరావతిలో బోటు రేస్ అందరినీ ఆకట్టుకోగా, మరో పక్క వైజాగ్ లో అదిరిపోయే మారథాన్ జరిగింది. నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా నిర్వహించే వైజాగ్ నేవీ మారథాన్ ఆదివారం విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా జరిగింది. దాదాపు 15వేలకు మంది పైగా మారథాన్‌లో పాల్గొన్నారు. సింబెక్స్ 18 ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొంటున్న రాయల్ సింగపూర్ నేవీ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. నేవీ మారథాన్‌ను 42.2కిమీ కరేజ్ రన్, 21.1 డెస్టినీ రన్, 10 కిమీ ఫ్రెండ్‌షిప్ రన్, 5 కిమీ ఫన్ రన్ కేటగిరీల్లో నిర్వహించారు.

vizagmarathon 19112018 2

ప్రస్తుతం తూర్పు తీరంలో ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొంటున్న రాయల్ సింగపూర్ నేవీ (ఆర్‌ఎస్‌ఎన్) సిబ్బంది ప్రతినిధులు 10 కిమీ ఫ్రెండ్‌షిప్ రన్‌లో పాల్గొన్నారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ 5 కిమీ ఫన్ రన్‌ను, ఆర్‌ఎస్‌ఎన్ ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ ఎడ్విన్ లియోంగ్ 10కిమీ ఫ్రెండ్‌షిప్ రన్‌ను ప్రారంభించారు. 42.2 కిమీ కరేజ్ రన్ పురుషుల విభాగంలో మోహిత్ రాథోడ్, మహిళల విభాగంలో కె.తిరుపతమ్మ ప్రథమ స్థానాలు సాధించారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కును తూర్పునౌకాదళ ప్రధానాధికారి కరమ్‌బీర్ సింగ్ అందజేశారు.

vizagmarathon 19112018 3

ఆదివారం తెల్లవారుజాము 4.15 గంటల నుంచి విశాఖ ఆర్కేబీచ్‌ తీర ప్రాంతం కిక్కిరిసిపోయింది. నావికాదళం నిర్వహిస్తున్న ఈ మారధాన్‌లో 15వేలమందికిపైగా పాల్గొన్నారు. 42 కి.మి., 21 కి.మి., 10 కి.మి, 5 కి.మి. విభాగాల్లో పరుగు పోటీలు నిర్వహించారు. తెల్లవారుజాము 42 కి.మి. పరుగును కెప్టెన్‌ అన్మేష్‌ ప్రారంభించారు. ఈ పరుగులో 351 మంది పాల్గొన్నారు. ఉదయం 5.15 గంటలకు 21 కి.మి. పరుగును కమాండెండ్‌ అరవింద్‌ శర్మ ప్రారంభించగా, ఇందులో 2254 మంది పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు 10 కి.మి. పరుగును రియల్‌ అడ్మిరల్‌ త్రిపాఠి ప్రారంభించగా, ఇందులో 4291 మంది, 5 కి.మి. పరుగులో 8253 మంది పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read