అమరావతి మీద ముందు నుంచి ద్వేషంతో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలో రాగానే, అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా, అమరావతి నిర్మాణాలు అన్నీ ఆపేసారు. తరువాత, అమరావతి రాజధానిగా ఉండదని, మూడు ముక్కలు చేస్తున్నాం అని, గుండెకాయి లాంటి సెక్రటేరియట్ వైజాగ్ తీసుకు వెళ్తున్నాం అని చెప్పారు. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుందని అన్నారు. దీని పై అసెంబ్లీలో తీర్మానం చెయ్యటం, తరువాత శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ పేరుతొ దీనికి బ్రేక్ పడింది. ఒకసారి నిర్ణయం జరిగి, ఆక్కడ 1500 కోట్లు రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చి, స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో, రాజధాని మారుస్తుంటే, కేంద్రం మాత్రం చూస్తూ కూర్చుంది. కేవలం కోర్ట్ లు మాత్రమే, ఈ అంశం పై గట్టిగా ఉన్నాయి. రేపు 26 వ తేదీన ఈ విషయం పై హైకోర్ట్ కూడా స్పష్టత ఇవ్వనుంది. అయినా విషయం కోర్ట్ లో ఉన్నా సరే, వైజాగ్ తరలింపు మాత్రం గుట్టుగా జరిగిపోతుందని అంటున్నారు.

navy 22022020 2

సెక్రటేరియట్, వైజాగ్ లో ని మిలీనియం టవర్స్ లో వస్తుందని, ప్రచారం చేసారు. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వ చర్యలు కూడా ఉండటంతో, విశాఖ మిలీనియం టవర్స్ లో, నిర్మాణం తధ్యం అని అందరూ అనుకున్నారు. అయితే, సరిగ్గా ఇలాంటి టైంలో, జగన్ కు షాక్ ఇచ్చింది ఇండిన నేవీ. మిలీనియం టవర్స్ లో, సచివాలయం ఏర్పాటు చెయ్యాలి అంటూ, ఏపి ప్రభుత్వం అడుగులు వేస్తున్న వార్తలు తెలుసుకున్న ఇండిన నేవీ, తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఇండియన్ నేవీని చెప్పటంతో, ఇక మిలీనియం టవర్స్ లో, సచివాలయం పెట్టే సాహసం చెయ్యలేక పోవచ్చని అంటున్నారు. ఇదే విషయం పై, జగన్ ఢిల్లీ వెళ్లి ఉంటారని, అందుకనే అమిత్ షా తో కూడా భేటీ అయ్యి, నేవీని ఒప్పించి మని ఉంటారని అనుకుంటున్నారు.

navy 22022020 3

ఇప్పటికే ఇండియన్ నేవీ ఈ విషయం పై, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు, ఈ రోజు ప్రముఖ జాతీయ పత్రికలో వార్తా కధనం వచ్చింది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు, దగ్గరలో ఉన్న మిలీనియం టవర్స్ లో, నిత్యం రద్దీగా ఉండే సచివాలయం లాంటి శాఖలను పెట్టుకోవటానికి, ఒప్పుకోం అని చెప్పినట్టు సమాచారం. శత్రు దేశాలకు, విశాఖపట్నం, ప్రాధాన లక్ష్యం అని, ఇక్కడ ఎన్నో ప్రముఖ పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని, దేశ భద్రత దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాంతాన్ని ఎంచుకోక పోవటమే మంచింది అని, నేవీ అధికారులు చెప్పారు. ఇక్కడ సచివాలయం పెరిగితే, ఆక్టివిటీ ఎక్కువ అయ్యి, చాలా సమస్యలు వస్తాయని, ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని, 734 ఎకరాలల్లో విస్తిరించి కీలక ప్రాంతం అని, చెప్పినట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read