రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో చెప్పే ఉదాహరణ ఇది.. మరీ ముఖ్యంగా, నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో, పోలీసు వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్ గా పని చేస్తుందో చెప్పే సంఘటన ఇది.. అలా అని అన్నీ 100% పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి అని కాదు కాని, ఉన్న దాంట్లో అద్భుతంగ పని చేస్తున్నారు.. సామాన్యుడి ట్వీట్ తో, పోలీసులకే జరిమానా వేసి, పారదర్శకంగా పని చేసి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో చూపించారు. అదీ కాక, ప్రతి ఒక్క పౌరుడుకీ ఉండే సాధనరణ ప్రశ్న, సామాన్యుడికి ఒక న్యాయం, మీ పోలీసులకు ఒక న్యాయమా అని, ఎదో ఒక సందర్భంలో అందరం అనుకునే ఉంటాం... కాని వైజాగ్ పోలీసులు మాత్రం, సామాన్యుడు అయినా ఒకటే, పోలీసులు అయినా ఒకటే, అందరికీ ఒకే న్యాయం అని మాటల్లో కాదు, చేతల్లో చెప్పి చూపించారు.
జూన్ 11 తారకు ఉదయం విశాఖపట్నం ఇసుక తోట జుంక్షన్ దగ్గర AP9P8283 అనే వాహనంలో ఇద్దరు పోలీస్ వారు వేగంగా వాహనం నడుపుతూ రెడ్ సిగ్నల్ ఉండగా సిగ్నల్ జంప్ చేసారు. వాళ్ళు చేసిన ఈ పనితో, అక్కడ ఉన్న సామన్య ప్రజలు, వారికి ఒక న్యాయం, మనకి ఒక న్యాయం, మనం ఇలా చేస్తే ఊరుకుంటారు అనుకుంటూ, ఎవరి పని వారు చూసుకున్నారు. కాని అదే సమయంలో అక్కడ ఉన్న ఆదిత్య అనే వ్యక్తి మాత్రం, అందరిలా చూస్తూ ఊరుకోలేదు. వెంటనే ట్విట్టర్ ద్వరా వైజాగ్ పోలీసులకు ట్వీట్ చేసారు. 5 నిమషాల క్రితం, ఇసుక తోట సెంటర్ లో, ఇద్దరు పోలీసులు, అతి వేగంతో, సిగ్నల్ జంప్ చేసారు, కొద్దిలో ఆక్సిడెంట్ మిస్ అయ్యింది, CCTV చూసి, తగు ఆక్షన్ తీసుకోండి అంటూ, ట్వీట్ చేసారు.
ఇక్కడ ఆదిత్య చేసింది, ఒక ట్వీట్ మాత్రమే. ఫోటో కూడా పెట్టలేదు. అయినా వైజాగ్ పోలీసులు, ఆ పౌరుడు చెప్పిన విషయాన్ని క్రాస్ చెక్ చేసారు. చెప్పిన టైం , ప్లేస్ ప్రకారం, ఆ సిసి టీవీ ఫూటేజ్ చూసారు. ఆదిత్య అనే సామాన్యుడు చెప్పిన విషయం, కరెక్ట్ అని నిర్ధారించుకున్నారు. వెంటనే ఆ వాహనానికి ఫైన్ వేసారు. ఇదే విషయం ట్విట్టర్ ద్వారా ఆదిత్య అనే పౌరుడుకి తెలియచేసారు. యువర్ ఆక్షన్, అవర్ రియాక్షన్ అంటూ, మీరు పెట్టిన ట్వీట్ నిర్ధారించుకున్నాం. ఆ వాహనం 3 టౌన్ పోలీస్ స్టేషన్ దిగా గుర్తించాము, సిగ్నల్ జంప్ అయినందుకు వాహనం పై 1035 రూపాయిల ఫైన్ విధించాము, రూల్స్ ఆర్ రూల్స్, థాంక్స్ అంటూ ఆ పౌరుడికి విషయం తెలియచేసారు. కేవలం ఒక సామాన్యుడు చెప్పిన విషయం నమ్మి, నిర్ధారణ చేసుకుని, పోలీసులు ఆక్ట్ చేసిన విధానం హర్షణీయం. ప్రతి సారి ఇంతే అలెర్ట్ గా మన పోలీసులు ఉండాలని కోరుకుందాం..