కోడి కత్తితో గుచ్చించుకున్న తరువాత, జగన్ మోహన్ రెడ్డి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ 0.5 cm గాయానికి, 9 కుట్లు వేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోడి కత్తి గుచ్చుడు గురించి, విచారణ నిమిత్తం, విశాఖ పోలీసులు, తెలంగాణా వెళ్లి, అక్కడ జగన్ మోహన్ రెడ్డి వాంగ్మూలం కోసం ప్రయత్నం చేయగా, నేను ఆంధ్రా పోలీసులని నమ్మను, తెలంగాణా పోలీసులని మాత్రమే నమ్ముతాను అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, జగన్ నంచి నుంచి వాగ్మూలం తీసుకోవలసి ఉందని విశాఖ పోలీసు కమిషనర్‌ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. అందుకే తమ వద్ద హాజరుకావాలని సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద ఆయనకు నోటీసులు అందజేశామని వెల్లడించారు. ఇదే విషయంతో రిజిస్టర్ పోస్టులో, జగన్ కు నోటీస్ పంపించనట్టు చెప్పారు.

jagan 291020181 2

దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావును ఆదివారం ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో ఏడు గంటలు విచారించిన అనంతరం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వం నియమించిన సిట్‌ అధికారులు హైదరాబాద్‌ వెళ్లి జగన్‌ వాగ్మూలం తీసుకునేందుకు నోటీసు ఇచ్చి ప్రయత్నిస్తే ఆయన నిరాకరించారు. అదే విషయాన్ని రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచాం. విచారణకు జగన్‌ స్వయంగా లేదా ఆయన ప్రతినిధి ద్వారా హాజరై వాగ్మూలం ఇవ్వాలని కోరుతూ రిజిస్టర్‌ పోస్టు ద్వారా మరోసారి నోటీసు పంపించాం. అప్పటికీ నిరాకరిస్తే.. న్యాయపరంగా ఏం చేయాలన్న దానిపై పరిశీలిస్తాం’ అని చెప్పారు. ఈ ఘటనపై సిట్‌తోపాటు ఆరు ప్రత్యేక బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నాయన్నారు. శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న తొలిరోజే ఆదివారం సుమారు ఏడు గంటల పాటు విచారించామన్నారు.

jagan 291020181 3

శ్రీనివాసరావు విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నప్పటికీ అతడు చెప్పివన్నీ నిజమేనని తాము విశ్వసించడం లేదన్నారు. దాడికి కారణంతోపాటు వెనుక ఎవరైనా ఉన్నారా అనేదానిపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని వివరించారు. ఆదివారం శ్రీనివాసరావుతోపాటు రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌, శ్రీనివాసరావుకు లేఖ రాయడంలో సహకరించిన విజయలక్ష్మి, రేవతీపతి, రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రమాదేవి సహా 12 మందిని విచారించామని తెలిపారు. విజయలక్ష్మి, రేవతీపతి చేతిరాత సరిపోలిందన్నారు. అంతేకాకుడా ఆ లేఖను శ్రీనివాసరావు చెబితే తాము రాసినట్లు ఇద్దరూ అంగీకరించారని వెల్లడించారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న వైసీపీ నేతలకు కూడా నోటీసు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరామన్నారు. శ్రీనివాసరావుకు ముమ్ముడివరం ఆంధ్రాబ్యాంకు, విజయా బ్యాంకు, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల్లో ఖాతాలు ఉన ్నట్లు గుర్తించామని.. వాటికి సంబంధించిన లావాదేవీల సమాచారం సోమవారం తమ చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read