ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగించి సమర్ధవంతమైన పాలన ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే... 90ల్లోనే టెక్నాలజీ ఉపయోగించిన మొదటి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు..
సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో, అన్నిట్లో టెక్నాలజీ ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు... పెన్షన్స్ లో, రుణ మాఫీలో నకిలీ లబ్ధి దారునాలి ఏరేయ్యటం మొదలు, సియం డ్యాష్ బోర్డు దాకా, అన్నిట్లో టెక్నాలజీ ఉపయోగించి సమర్ధవంతమైన పాలన చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా పోలీసులు కూడా, తెలికిగా సమర్ధవంతంగా విధులు నిర్వహించటానికి, "Hoverboard"లని అందించారు. ముందుగా వైజాగ్ లో పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టనున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ చెయ్యటానికి, పెట్రోలింగ్ చెయ్యటానికి, ఫుట్ పాత్ క్లియర్ చెయ్యటానికి, బీచ్ లలో విధులు నిర్వహించటానికి, ఇలా అన్ని పనులు తేలికగా చేసే వీలు, ఈ "Hoverboard"లో ఉంటుంది.
మీరు కూడా ఈ వీడియోలో చూడండి, వైజాగ్ లో పోలీస్ ఈ "Hoverboard" ఉపయోగించి ఎలా పని చేస్తున్నారో..