ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం, చంద్రబాబు నాయుడు హయంలో, 2018లో ప్రత్యేకంగా ‘శక్తి’ టీమ్‌లను ఏర్పాటు చేసారు. ఈ మహిళా శక్తి బృందాలు, మహిళలకు రక్షణగానే కాకుండా, ప్రజలకు వివిధ నేరాల్ ఆపై అవగాహన కూడా కలిపిస్తూ ఉంటారు. వీరికి ప్రత్యేకంగా ఇన్నోవా వాహనాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా, ఈ వ్యవస్థ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు వైజాగ్ లో ఈ శక్తి టీమ్స్ చేసిన పనితో, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వారికి ఇచ్చిన విధులను గాలికి వదిలేసి, టిక్ టాక్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు, వైజాగ్ శక్తి టీం పోలీసులు. టిక్ టాక్ కు అలవాటు పడి, అది వ్యసనంగా మారటంతో, విధులు కూడా పక్కన పడేసి, డ్యూటీలో ఉండగానే, యునిఫారం ఉండగానే టిక్ టాక్ చేసుకుంటూ, పంచ్ డైలాగులు, జబర్దస్త కామెడీతో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

shakti 2707209 2

ఏకంగా వారికి ఇచ్చిన పోలీస్ వాహనంలోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఈ మహిళా ఖాకీల పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. యునిఫారంలో ఉండగానే, ఇలాంటి చేష్టలు ఏమిటి అంటూ, విమర్శలు వస్తున్నాయి. అయితే దీని పై పోలీస్ ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పటికే ఈ టిక్ టాక్ వ్యసనంలో పడి తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిని చూసాం. అక్కడలా ఇక్కడ ప్రభుత్వం కూడా, వీరి పై చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. తెలంగాణాలో ఇప్పటికే ఈ జాడ్యం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు చుట్టుకుంది. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విధుల్లో ఉన్న పోలీసుల దాకా పాకింది.

shakti 2707209 3

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిక్‌టాక్‌ వ్యవహారం ముందుగా వెలుగులోకి వచ్చింది. వారిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. తరువాత, కరీంనగర్ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉద్యోగుల టిక్‌టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో టిక్‌టాక్ చేసిన జూనియర్ డాక్టర్లను కూడా సస్పెండ్ చేసారు. ఇలా చివరకు డాక్టర్లు, పోలీసులు, కూడా సోషల్ మీడియా పిచ్చలో పడి ప్రభుత్వ సేవ, ప్రజల సేవ మరిచి, టిక్ టాక్ లలో విచిత్రమైన పనులు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి వాటి పై ఖటినంగా ఉండాలి. ఇలాంటి వారిని ఉపేక్షించ కుండా, వెంటనే సస్పెండ్ చేస్తే కాని, వేరే వారికి ఇది పాక కుండా, ఆగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read