విశాఖ ఉక్కు పరిశ్రమను, వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, విశాఖలో మొదటి నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి వ్యతిరేకిస్తూ, ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా బయట నుంచి కూడా మద్దతు లభిస్తుంది. నిన్న తెలంగాణా నుంచి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మల్యే సీతక్క కూడా, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి నారా రోహిత్, ఆర్పీ పట్నాయక్, చిరంజీవి కూడా మద్దతు పలికారు. నిన్న బీజేపీ ఎంపీ సుభ్రమణ్య స్వామి కూడా, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలుకుతామని చెప్పటం జరిగింది. క్రమంగా, రోజు రోజుకీ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు లభిస్తుంది. ఇక మరో వైపు, ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయటానికి, కార్మికలు, కార్మిక సంఘాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఉద్యమానికి బలం చేకూరుస్తూ, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ఇప్పుడు కీలకా నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సమ్మె నోటీస్ కూడా సర్వ్ చేసి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నట్టు చెప్పారు.
ముందుగా నిబంధనలు ప్రకారం 14 రోజులు ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం అని, ఈ నెల 25 తరువాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్ళవచ్చ అని కార్మికులు చెప్పారు. ఇండస్ట్రియల్ డిస్ప్యుట్ ఆక్ట్ 1947 సెక్షన్ 22 ప్రకారంగా, ఈ నోటీస్ ని సర్వ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది. ఇందులో ప్రధానంగా, వాళ్ళు అయుదు అంశాలకు ఇందులో పేర్కొనటం జరిగింది. ఇందులో ప్రధానంగా వంద శాతం ప్రైవేటీకరణకు ఆమోదిస్తూ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకొందో, దీన్ని వ్యతిరేకిస్తున్నాం, అలాగే, స్టీల్ ప్లాంట్ అమ్మకం పై వేసిన కమిటీ పైన, అలాగే పోస్కోతో చేసుకున్న ఒప్పందం పైన, స్టీల్ ప్లాంట్ భూములుకు సంబంధించి అమ్మకం పై, అలాగే ఇక్కడ భూములు ఇచ్చిన 8 వేల మంది రైతులకు ఉద్యోగులు ఇవ్వాలని, ఇలా ఈ డిమాండ్లు ముందు పెట్టారు. దీని పై యాజమాన్యం సరిగ్గా స్పందించకపోతే, 25 తరువాత ఏ క్షణంలో అయినా సమ్మెకు వెళ్తాం అని చెప్పి, కార్మికులు చెప్తున్నారు. దీంతో ఈ ఉద్యమానికి, రానున్న రోజుల్లో మరింత సపోర్ట్ లభించటంతో పాటుగా, ఉద్యమం మరింతగా ముందుకు వెళ్లనుంది.