వరుస విపత్తులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇప్పుడు మరో గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా మారింది. ఉత్తరాంధ్ర దిశగా వాయుగుండం వేగంగా కదులుతుంది. ఈ వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ రోజు రాత్రికి కానీ, రేపు కానీ తుఫానుగా మారే అవకాసం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫానుకు జవాద్‍ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వాయుగుండం, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఈ తుఫాను ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా తీరం మధ్య తీరం దాటే అవకాసం ఉందని భావిస్తున్నారు. ఈ రోజు మధ్యానం నుంచి రేపటి వరకు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. తుఫాను తీరం దాటే సమయంలో, 100 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాసం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈ తుఫాను ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పైన అధికంగా ఉండే అవకాసం ఉందని తెలుస్తుంది. అలాగే విశాఖ జిల్లా పైన ఒక మోస్తరుగా, తూర్పుగోదావరి జిల్లాపైనా తుఫాను ప్రభావం ఉండే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read