ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామతీర్ధం పర్యటన అడుగడుగునా పోలీసుల అవాంతరాలతో సాగుతుంది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుంచి చంద్రబాబు విజయనగరం బయలు దేరి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు విజయనగరం బయలుదేరి వెళ్లారు. విజయనగరంలో, తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి. అయితే చంద్రబాబు విజయనగరం వెళ్ళినప్పటి నుంచి చంద్రబాబుకు అవాంతరాలు ఎదురు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు కార్లు అన్నీ పోలీసులు ఆపేసారు. కేవలం చంద్రబాబు ఆరు కార్లు కాన్వాయ్ తో చంద్రబాబుని ముందుకు పంపించారు. చంద్రబాబు కాన్వాయ్ ను ముందుకు పంపించి, మిగతా తెలుగుదేశం నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల కార్లు అనుమతి ఇవ్వలేదు. దారికి అడ్డంగా లారీలు పెట్టి, నేతల కార్లు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం నేతలు కిందకు దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మేము వెళ్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి, విజయసాయి రెడ్డిని ఎలా అనుమతి ఇచ్చారో, మాకు అలాగే ఇవ్వాలి కదా అంటూ, పోలీసులు పై ఫైర్ అయ్యారు. అయితే ఈ సమయంలో తోపులాట జరిగింది. మాజీ మంత్రి చినరాజప్పను తోసేసారు.

cbn 02012020 2

అయితే విషయం తెలుసుకున్న చంద్రబాబు నిరసనకు దిగారు. తనకు మాత్రమే అనుమతి ఇచ్చి, మిగతా నాయకులను ఆపేయటం పై చంద్రబాబు నిరసన తెలిపారు. పోలీసులు తీరుకు నిరసిస్తూ, రోడ్డుపై బైఠాయించారు. అయితే చంద్రబాబు వస్తున్నారని తెలిసి, ముందుగానే విజయసాయి రెడ్డి రామతీర్ధం వెళ్ళటం, మొత్తం వివాదానికి కారణం అయ్యింది. చంద్రబాబు కంటే ముందుగానే విజయసాయి రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న బీజేపీ నేతలను పంపించే ప్రయత్నం చేయటంతో, స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు వచ్చే దాకా అక్కడే ఉండి, ఏదో ఒక గోల చెయ్యలని విజయసాయి రెడ్డి ప్లాన్ వేసారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నాయి. ముందుగా ఒక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకున్న తరువాత కూడా, ఎలా విజయసాయి రెడ్డికి అనుమతి ఇచ్చారు అంటూ తెలుగుదేశం నేతలు, పోలీసులను ప్రశ్నిస్తున్నారు. దేవుళ్ళకు రక్షణ లేదని, దీని పై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపడితే, ఆ విషయం ప్రజల్లోకి వెళ్ళకుండా విజయసాయి రెడ్డి వేసిన ప్లాన్ ఇదంతా అంటూ తెలుగుదేశం నేతలు మండి పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read