ప్రముఖ జర్నలిస్ట్ వెంకటకృష్ణ పై, గత నాలుగు రోజులు నుంచి, కొంత మంది చేస్తున్న విష ప్రచారం అంతా ఇంతా కాదు. వీరి కక్షకి కారణం లేకపోలేదు. వీరి అభిమాన రాజకీయ నాయకులు చేసే పనులు అన్నీ, ఎక్ష్పొజ్ చేస్తూ, ప్రతి రోజు సాయంత్రం డిబేట్ పెడుతూ ఉంటారు. ఆ డిబేట్ కూడా అర్ధవంతంగా ఉండటంతో, ఏబీఎన్ లో సాయంత్రం వచ్చే ఆ డిబేట్ కు ప్రజాధరణ కూడా ఉంది. అయితే ఇందులో వెంకటకృష్ణ సంధించే ప్రశ్నలు, వెటకారంతో చేసే కామెంట్స్ కి సహజంగానే, అవతల వారు హార్ట్ అవుతారు. ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భమే వెంకటకృష్ణకు నాలుగు రోజులు క్రితం ఎదురు అయ్యింది. ఆయన తాను కొద్ది రోజులు విరామం తీసుకుంటున్నా అని, ప్రయాణంలో అనేక మజిలీలు ఉంటాయి అంటూ, ఒక ట్వీట్ చేసారు. ఆ తరువాత రోజు ఏబీఎన్ డిబేట్ కు కుడా రాలేదు. అంతే ఇంకేముంది, పేటీయం బ్యాచ్ రెచ్చిపోయింది. రాధాకృష్ణకు, వెంకటకృష్ణకు చెడింది అంటూ, రకరకాల కధలు అల్లేసారు. అదే నిజం అని ప్రజలను నమ్మించే వ్యవస్థ వీరి దగ్గర ఉంది కాబట్టి రెచ్చిపోయారు. అంతే కాదు, ఫేక్ ఎకౌంటు క్రియేట్ చేసి, వెంకట కృష్ణ చెప్పినట్టుగా, రాధాకృష్ణని తిడుతూ, చంద్రబాబుని, బీజేపీని కలుపుతూ, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాల ఫేక్ ప్రచారం చేసారు.

vk 26032021 2

చివరకు వెంకటకృష్ణ వార్నింగ్ ఇచ్చి, వారి పై కేసులు పెడతాను అని హెచ్చరించటంతో, అప్పుడు వీళ్ళు కొంచెం తగ్గారు. అప్పటి నుంచి వెంకటకృష్ణ, తరువాత ఇది చేస్తాడు, అది చేస్తాడు, చంద్రబాబు అది చేపిస్తాడు అంటూ, తమకు వచ్చిన విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసలు చంద్రబాబుకి, వెంకటకృష్ణకు సంబంధం ఏమిటో వీరే చెప్పాలి. అయితే ఈ పేటీయం బ్యాచ్ కు షాక్ ఇస్తూ, ఈ రోజు మళ్ళీ ఏబీఎన్ డిబేట్ లో ప్రత్యక్షం అయ్యారు వెంకటకృష్ణ. రకరకాల కధలు, ప్రచారాలు చేసిన అ బ్యాచ్ మొత్తానికి షాక్ ఇస్తూ, కొన్ని వ్యాఖ్యలు కూడా చేసారు. ఆయన మాట్లాడుతూ "కొంత మంది డిజప్పాయింట్ అయినట్టు ఉన్నారు. కానీ ఏమి డిజప్పాయింట్ అవ్వకండి. మీకు పూర్తి సంతృప్తి ఇచ్చే దాకా చేస్తా. చేసిన తరువాత అప్పుడు, కొత్త ప్లాన్స్ వేసుకుంటా. ఏమి బాధపడకండి. ఇంకా చెప్పాలని ఉంది కానీ, పిశాచగణాలకి అర్ధమయ్యే భాషలో చెప్పటానికి, ఇది ప్లాట్ఫారం కాదు. ఈ సీటు సరిపోదు. దానికి వేరే చూసుకుందాం. అప్పుడు చెప్తా అందరికీ. " అంటూ వెంకట కృష్ణ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో విష ప్రచారం చేసే మీడియా, సోషల్ మీడియా వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పే సంఘటన ఇది. ప్రజలే విజ్ఞతతో అలోచించి ఏ విషయం పైన అయినా ఒక అంచనాకు రావాల్సిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read